మళ్లీ 24,000 పైకి నిఫ్టీ
ABN , Publish Date - Jul 02 , 2026 | 05:44 AM
రెండు రోజుల వరుస నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు బుధవారం మళ్లీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 443.97 పాయింట్లు పెరిగి 76,922.64 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 140.10 పాయింట్ల వృద్ధితో...
సెన్సెక్స్ 444 పాయింట్లు అప్
ముంబై: రెండు రోజుల వరుస నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు బుధవారం మళ్లీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 443.97 పాయింట్లు పెరిగి 76,922.64 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 140.10 పాయింట్ల వృద్ధితో 24,005.85 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో 22 రాణించగా.. ఎటర్నల్ షేరు 5.71 శాతం ఎగబాకి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.39 లక్షల కోట్లు పెరిగి రూ.476.48లక్షల కోట్లకు చేరింది. ముడిచమురు ధరల తగ్గుదలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల ట్రేడింగ్ ట్రెండ్ ఇందుకు దోహదపడింది. రూపాయి..60 పైసలు పతనం: భారత కరెన్సీ వరుసగా మూడో రోజూ క్షీణించింది. ఫారెక్స్ ట్రేడింగ్‌లో బుధవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 60 పైసల నష్టంతో రూ.95.16 వద్ద ముగిసింది. డాలర్ బలోపేతంతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ ఇందుకు కారణంగా ఉంది.
ఇవి కూడా చదవండి...
దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్
కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల
Read Latest AP News And Telangana News And National News