రెండో రోజూ లాభాల్లో మార్కెట్
ABN , Publish Date - Feb 18 , 2026 | 01:56 AM
ప్రపంచ మార్కెట్ల నుంచి ఎలాంటి ఉత్సాహపూరితమైన సంకేతాలు లేకపోవడం, ఇన్వెస్టర్లు వేచి ఉండే ధోరణి అనుసరించిన నేపథ్యంలో మంగళవారం ఈక్విటీ మార్కెట్లు...
సెన్సెక్స్ 173 పాయింట్లు అప్
ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి ఎలాంటి ఉత్సాహపూరితమైన సంకేతాలు లేకపోవడం, ఇన్వెస్టర్లు వేచి ఉండే ధోరణి అనుసరించిన నేపథ్యంలో మంగళవారం ఈక్విటీ మార్కెట్లు నిస్తేజంగానే ట్రేడయినప్పటికీ ప్రధాన సూచీలు మాత్రం లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ, యంత్రపరికరాల షేర్లు ఇందుకు దోహదపడ్డాయి. సెన్సెక్స్ 173.81 పాయింట్ల లాభంతో 83,450.96 వద్ద ముగియగా నిఫ్టీ 42.65 పాయింట్ల లాభంతో 25,725.40 వద్ద ముగిసింది. మార్కెట్ లాభపడడం వరుసగా రెండో రోజు. బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,52,688.24 పెరిగి రూ.4,70,11,313.57 కోట్లకు చేరింది.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం