వరుస నష్టాల నుంచి ఊరట
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:12 AM
వరుసగా ఎనిమిది వారాలుగా నష్టపోతూ వస్తున్న స్టాక్ మార్కెట్లకు సోమవారం స్వల్ప ఊరట లభించింది. సెన్సెక్స్ 472.77 పాయింట్ల లాభంతో...
సెన్సెక్స్ 473 పాయింట్లు అప్
ముంబై: వరుసగా ఎనిమిది వారాలుగా నష్టపోతూ వస్తున్న స్టాక్ మార్కెట్లకు సోమవారం స్వల్ప ఊరట లభించింది. సెన్సెక్స్ 472.77 పాయింట్ల లాభంతో 72,382.47 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 133.80 పాయింట్ల వృద్ధితో 22,555.75 వద్ద ముగిసింది. ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.11 లక్షల కోట్లు పెరిగి రూ. 469.07 లక్షల కోట్లకు (4.87 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. చమురు సరఫరాపై ఆందోళనలు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు ఇందుకు దోహపడ్డాయి. అమెరికాలో ఉద్యోగ నియామకాలు అంచనాల కంటే తగ్గిన నేపథ్యంలో ఫెడ్ రిజర్వ్ మున్ముందు సమీక్షల్లోనూ వడ్డీ రేట్లపై కఠిన వైఖరిని ప్రదర్శించక పోవచ్చన్న ఆశాభావం గ్లోబల్ మార్కెట్లలో ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచిందని విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు తగ్గి రూ.96.30 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు పీపా ధర ఒకదశలో 102.4 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
ఈ వార్తలనూ చదవండి:
త్వరలో GST కౌన్సిల్ భేటీ.. సంచలన సంస్కరణలకు శ్రీకారం!
స్థిరంగా పసిడి ధరలు.. ప్రస్తుతం రేట్స్ ఇవీ