Share News

లాభాల్లో మార్కెట్లు సెన్సెక్స్‌ 152 పాయింట్లుఅప్‌

ABN , Publish Date - Aug 06 , 2026 | 04:20 AM

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) వరుసగా నాలుగోసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో..

లాభాల్లో మార్కెట్లు సెన్సెక్స్‌ 152 పాయింట్లుఅప్‌

ముంబై: భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) వరుసగా నాలుగోసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో బుధవారం దేశీయ ప్రామాణిక సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ చివరికి 152.05 పాయింట్ల లాభంతో 78,581 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ప్రథమార్ధంలో డే గరిష్ఠ స్థాయి 79,055.38ని తాకినా.. మధ్యాహ్నం సెషన్‌లో నష్టాల్లోకి జారుకుని 78,285.74 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ 9.75 పాయింట్లు పెరిగి 24,624.65 వద్ద ముగిసింది.

  • డాలర్‌ మారకంలో రూపాయి విలువ 20 పైసలు పెరిగి రూ.95.08 వద్ద ముగిసింది. ముడి చమురు ధరల్లో తగ్గుదల, విదేశీ మార్కెట్లో అమెరికా డాలర్‌ బలహీనత ఇందుకు కారణం.

ఇవీ చదవండి:

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

Updated Date - Aug 06 , 2026 | 04:20 AM