లాభాల్లో మార్కెట్లు
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:21 AM
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ల్లో దిద్దుబాటు, బ్లూచిప్ బ్యాంకు, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల నేపథ్యంలో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు...
సెన్సెక్స్ 107 పాయింట్లు అప్
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ల్లో దిద్దుబాటు, బ్లూచిప్ బ్యాంకు, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల నేపథ్యంలో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 107.25 పాయింట్ల లాభంతో 81,106.65 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 340.01 పాయింట్లు పెరిగి 81,339.41 స్థాయిని తాకింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 58.25 పాయింట్ల లాభంతో 25,044.65 వద్ద క్లోజైంది.
ముహూరత్ ట్రే డింగ్‌లో స్వల్ప నష్టాలు: దీపావళి సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ముహూరత్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 414.09 పాయింట్లు పెరిగి 81,442.11 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 28.62 పాయింట్ల నష్టం తో 80.999.40 వద్ద క్లోజైంది. ఇక నిఫ్టీ 43.95 పాయింట్లు తగ్గి 24,986.40 వద్ద క్లోజైంది. దీంతో ఎనిమిదేళ్లుగా దీపావళిన నమోదవుతున్న లాభాల పరంపరకు తెరపడింది.
నేడు మార్కెట్లకు సెలవు: దీపావళి-బలిప్రతిపాద సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎ్‌సఈలకు సెలవు. కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు కూడా పనిచేయవు. బుధవారం మార్కెట్లు యధావిధిగా పని చేస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి
దీపావళి బాణసంచా ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు