ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్
ABN , Publish Date - Apr 10 , 2026 | 02:20 AM
స్టాక్ మార్కెట్‌లో ఐదు రోజుల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 931.25 పాయింట్ల నష్టంతో 76,631.65 వద్ద ముగియగా నిఫ్టీ 222.25 పాయింట్ల నష్టంతో 23,775.10 వద్ద ముగిసింది...
సెన్సెక్స్ 931 పాయింట్లు డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్‌లో ఐదు రోజుల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 931.25 పాయింట్ల నష్టంతో 76,631.65 వద్ద ముగియగా నిఫ్టీ 222.25 పాయింట్ల నష్టంతో 23,775.10 వద్ద ముగిసింది. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై నెలకొన్న అనుమానాలు... ఆసియా, ఐరోపా ప్రధాన మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, బ్రెంట్ రకం ముడి చమురు ధర ఒక్క రోజులోనే బ్యారెల్ 3.27% పెరిగి 97.85 డాలర్లకు చేరడం, కొనసాగుతున్న ఎఫ్‌పీఐల అమ్మకాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
లాభాల్లో రెయిన్ ఇండస్ట్రీస్ షేర్లు: మార్కెట్ నష్టా ల్లో ఉన్నప్పటికీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే రెయిన్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు మాత్రం గురువారం లాభాలతో ముగిశాయి. బీఎ్‌సఈలో ఇంట్రా డేలో 6ు వరకు లాభపడిన ఈ షేరు చివరికి 2.16ు లాభంతో రూ.120.50 వద్ద ముగిసింది. కంపెనీ ఈక్విటీలో ప్రముఖ ఇన్వెస్టర్ డోలీ ఖన్నా వాటా 1.01 శాతానికి చేరిందన్న వార్తలు ఇందుకు ప్రధాన కారణం. కంపెనీ రికార్డుల ప్రకారం 2026 మార్చి,తో ముగిసిన నాలుగో త్రైమాసికం నాటికి కంపెనీలో డోలీ ఖన్నా 35,35,895 షేర్లు కలిగి ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News