మార్కెట్లలో మళ్లీ క్రూడ్ కల్లోలం
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:09 AM
క్రూడాయిల్ మరోసారి స్టాక్‌మార్కెట్లలో కల్లోలం రేపుతోంది. అమెరికా-ఇరాన్ చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా బ్యారెల్ క్రూడ్ ధర మరోసారి 100 డాలర్లు దాటడంతో...
852 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
రూపాయి మరో 23 పైసలు డౌన్
ముంబై: క్రూడాయిల్ మరోసారి స్టాక్‌మార్కెట్లలో కల్లోలం రేపుతోంది. అమెరికా-ఇరాన్ చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా బ్యారెల్ క్రూడ్ ధర మరోసారి 100 డాలర్లు దాటడంతో ఈక్విటీ, ఫారెక్స్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఈక్విటీ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు కూడా భారీగా నష్టపోయాయి. గురువారం సెన్సెక్స్ 852.49 పాయింట్లు నష్టపోయి 77,664 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో గరిష్ఠంగా 942.31 పాయింట్లు దిగజారింది. నిఫ్టీ 205.05 పాయింట్లు నష్టపోయి 24,173.05 వద్ద ముగిసింది. రెండు వరుస సెషన్లలో సెన్సెక్స్ 1600 పాయింట్లు, నిఫ్టీ 403 పాయింట్లకు పైగా నష్టపోయాయి. అలాగే అమెరికన్ డాలర్ మారకంలో రూపాయి మరో 23 పైసలు నష్టపోయి 94.11 వద్ద ముగిసింది. రూపాయి నష్టపోవడం వరుసగా ఇది నాలుగో రోజు. బుధవారం నష్టపోయిన 34 పైసలతో కలిపితే రెండు రోజుల్లోనే 57 పైసలు నష్టపోయింది. క్రూడాయిల్ ధరలతో పాటు ఆసియన్, యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో బలహీన ట్రెండ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను దెబ్బ తీసిందని విశ్లేషకులంటున్నారు.
మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 0.39%, స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 0.34% నష్టపోయాయి.
గురువారం బ్యారెల్ క్రూడాయిల్ ధర 1,89% పెరిగి 103.8 డాలర్లకు చేరింది.
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) బుధవారం రూ.2,078.36 కోట్ల విలువ గల షేర్లను విక్రయించారు.
ఇవి కూడా చదవండి..
శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్
నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి