Share News

చమురు చుర్రు.. సూచీలు బేజారు

ABN , Publish Date - May 01 , 2026 | 04:51 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు గురువారం మళ్లీ నష్టాల్లో పయనించాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలు 2022 నాటి గరిష్ఠ స్థాయి...

చమురు చుర్రు.. సూచీలు బేజారు

  • సెన్సెక్స్‌ ఒక దశలో 1,238 పాయింట్లు పతనం

  • 583 పాయింట్ల నష్టంతో 77,000 దిగువన ముగింపు

  • మళ్లీ 24,000 దిగువకు నిఫ్టీ

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు గురువారం మళ్లీ నష్టాల్లో పయనించాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలు 2022 నాటి గరిష్ఠ స్థాయి 125 డాలర్లకు చేరడం, అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ట్రెండ్‌, విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ ఇందుకు కారణమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 1,237.5 పాయింట్ల వరకు పతనమై 76,258.86 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం నుంచి మార్కెట్‌ మళ్లీ కోలుకుంది. దాంతో సూచీ 582.86 పాయింట్ల నష్టంతో 76,913.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 180.10 పాయింట్లు కోల్పోయి 23,997.55 వద్ద స్థిరపడింది. బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.5.33 లక్షల కోట్లు తగ్గి రూ.463.29 లక్షల కోట్లకు (4.86 లక్షల కోట్ల డాలర్లు) జారుకుంది.

పసిడి పెరిగే.. వెండి తగ్గే: దేశీయంగా విలువైన లోహాలు మిశ్రమ ట్రెండ్‌ను కనబరిచాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర రూ.2,000 పెరిగి రూ.1,54,800కు చేరుకుంది. కిలో వెండి మాత్రం రూ.1,800 తగ్గుదలతో రూ.2,42,700కు జారుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒకదశలో 4,635.52 డాలర్లు, సిల్వర్‌ 73.69 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.

నేడు మార్కెట్లకు సెలవు: మహారాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మే 1న (శుక్రవారం) స్టాక్‌ ఎక్స్ఛేంజీలైన బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈతో పాటు ఫారెక్స్‌, కమోడిటీ మార్కెట్లకు సెలవు. మార్కెట్లు మళ్లీ సోమవారం (4వ తేదీ) యధావిధిగా పనిచేస్తాయి.

ఇవి కూడా చదవండి

స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెగ్యులర్‌గా మార్పు

చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు

Updated Date - May 01 , 2026 | 04:51 AM