వారమంతా నష్టాలే..
ABN , Publish Date - Jul 25 , 2026 | 02:06 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా ఐదో రోజు నష్టపోయాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారీగా పెరిగిన ముడి చమురు ధరలతో పాటు ట్రంప్ తాజా సుంకాల వడ్డింపు,,,
సెన్సెక్స్ 332 పాయింట్లు పతనం
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా ఐదో రోజు నష్టపోయాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారీగా పెరిగిన ముడి చమురు ధరలతో పాటు ట్రంప్ తాజా సుంకాల వడ్డింపు ఇందుకు కారణమయ్యాయి. శుక్రవారం ఆరంభంలో ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 917 పాయింట్ల మేర క్షీణించి 75,474 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం నుంచి ఇన్వెస్టర్లు భారీగా పతనమైన షేర్లలో వాల్యూ బయ్యింగ్‌కు దిగటంతో సూచీలు భారీ నష్టాల నుంచి కాస్త తేరుకోగలిగాయి. వారాంతం ట్రేడింగ్ నిలిచే సరికి సెన్సెక్స్ 331.62 పాయింట్ల నష్టంతో 76,059.77 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 102.15 పాయింట్లు కోల్పోయి 23,767.45 వద్ద ముగిసింది. కాగా, గడిచిన 5 సెషన్ల (ఈవారం)లో సెన్సెక్స్ 2,091.68 పాయింట్లు (2.67 శాతం), నిఫ్టీ 566.85 పాయింట్లు (2.32 శాతం) నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు పెరిగి రూ.96.53 వద్ద ముగిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు