పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..
ABN , Publish Date - Sep 01 , 2026 | 02:50 AM
పశ్చిమాసియాలో మళ్లీ తలెత్తిన ఉద్రిక్తతలు ముడి చమురు ధరల పెరుగుదలకు దారితీయడం, ఫలితంగా అధిక వడ్డీ రేట్ల వాతావరణం...
సెన్సెక్స్ 307 పాయింట్లు డౌన్
ముంబై: పశ్చిమాసియాలో మళ్లీ తలెత్తిన ఉద్రిక్తతలు ముడి చమురు ధరల పెరుగుదలకు దారితీయడం, ఫలితంగా అధిక వడ్డీ రేట్ల వాతావరణం ఏర్పడుతుందనే భయాల నేపథ్యంలో యుటిలిటీస్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో చోటు చేసుకున్న అమ్మకాల ప్రభావంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్ 307.24 పాయింట్ల నష్టంతో 76,957.27 వద్ద మగిసింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 20 నష్టాలతో 10 లాభాలతో ముగిశాయి. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 95.25 పాయింట్ల నష్టంతో 24,080.40 వద్ద క్లోజైంది. కాగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ ముడి చమురు ధర 3.63 శాతం పెరిగి 91.30 డాలర్లకు చేరుకుంది.
ఇవి కూడా చదవండి
ఎడ్యుకేషన్ హబ్‌గా హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్
రామ మందిరానికి రూ.4 కోట్ల విరాళం.. అకౌంట్లో మాత్రం రూ.3!