ఐటీ షేర్లలో అమ్మకాలు
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:21 AM
ఐటీ షేర్లలో భారీగా అమ్మకాలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో దేశీయ ప్రామాణిక సూచీలు బుధవారం నష్టాలతో...
సెన్సెక్స్ 300 పాయింట్ల పతనం
ముంబై: ఐటీ షేర్లలో భారీగా అమ్మకాలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో దేశీయ ప్రామాణిక సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్ 303.67 పాయింట్లు నష్టపోయి 74,346.17 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 1,157.24 పాయింట్ల నష్టంతో 73,492.60ను తాకింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 77.95 పాయింట్ల నష్టంతో 23,405.60 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 8.43 శాతం నష్ట పోగా టెక్ మహీంద్రా (6.23 శాతం), హెచ్‌సీఎల్ టెక్ (5.25 శాతం) , ఇన్ఫోసిస్ (3.82 శాతం), ఐటీసీ, ఎటర్నల్, లార్సెన్ అండ్ టుబ్రో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు క్షీణించాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం 40 పైసలు తగ్గి రూ.95.76 వద్ద ముగిసింది.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం