మార్కెట్ మళ్లీ నష్టాల్లోకి..
ABN , Publish Date - May 06 , 2026 | 04:29 AM
ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం మళ్లీ నష్టాల్లో పయనించాయి. సెన్సెక్స్ ఒక దశలో 754.37 పాయింట్లు క్షీణించి 76,515 వద్ద...
సెన్సెక్స్ 252 పాయింట్లు డౌన్
ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం మళ్లీ నష్టాల్లో పయనించాయి. సెన్సెక్స్ ఒక దశలో 754.37 పాయింట్లు క్షీణించి 76,515 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 251.61 పాయింట్ల నష్టంతో 77,017.79 వద్ద స్థిరపడింది. ఒక దశలో 24,000 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ.. చివర్లో 86.50 పాయింట్ల నష్టం తో 24,032.80 వద్ద ముగిసింది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన, హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు మరింత ఎగబాకడం, రూపాయి క్షీణత ఇందుకు కారణమయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 18 నష్టపోయాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసల లాభంతో రూ.95.18 వద్ద ముగిసింది. భారత స్టాక్ మార్కెట్‌పై దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐ) క్రమంగా పట్టు పెంచుకుంటున్నారు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో నిఫ్టీ 500 కంపెనీల్లో డీఐఐల ఈక్విటీ వాటా సరికొత్త రికార్డు స్థాయి 20.9 శాతానికి పెరిగింది. అదే సమయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) వాటా 17.1 శాతానికి తగ్గింది.
ఇవి కూడా చదవండి:
‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్
ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్