రెండో రోజూ నష్టాలే
ABN , Publish Date - Jul 22 , 2026 | 02:12 AM
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 238.41 పాయింట్లు కోల్పోయి 77,470.11 వద్ద, నిఫ్టీ 50 సూచీ 50.80 పాయింట్ల నష్టంతో...
సెన్సెక్స్ 238 పాయింట్లు డౌన్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 238.41 పాయింట్లు కోల్పోయి 77,470.11 వద్ద, నిఫ్టీ 50 సూచీ 50.80 పాయింట్ల నష్టంతో 24,187.70 వద్ద ముగిశాయి. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు షేర్లలో అమ్మకాల ఒత్తిడి, అమెరికా-ఇరాన్ మధ్య తీవ్రమవుతున్న యుద్ధం మంగళవారం మార్కెట్ సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీశాయి. సెన్సెక్స్‌లోని 30షేర్లలో 21 షేర్లు లాభాలతో ముగిశాయి. అయినా సెన్సెక్స్ హెవీ వెయుట్ స్టాక్స్ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, టీసీఎస్, ఇన్ఫోసిస్ తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడం సూచీలను కిందికి లాగాయి.
ఎస్‌బీఐ ఎఫ్‌ఎంకు లిస్టింగ్ లాభాలు
ఇటీవల ఐపీఓకు వచ్చిన ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ (ఎస్‌బీఐ ఎఫ్‌ఎం) కంపెనీ షేర్లు మంగళవారం బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈల్లో లాభాలతో లిస్టయ్యాయి. ఒక్కోటి రూ.574కు జారీ చేసిన ఈ షేర్లు బీఎ్‌సఈలో 6.27 శాతం లాభంతో రూ.610 వద్ద లిస్టయి ఒక దశలో 8.88 శాతం వృద్ధితో రూ.625ను తాకాయి. చివరికి 6.25 శాతం లాభం తో రూ.609.90 వద్ద ముగిశాయి.
ఇంకా అమ్మే యోచన లేదు: ఎస్‌బీఐ చైర్మన్
ఎస్‌బీఐ ఎఫ్‌ఎం ఈక్విటీలో ప్రస్తుతం తమకు ఉన్న 55 శాతం వాటా నుంచి మరింత విక్రయించే యోచనలేదని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి స్పష్టం చేశారు. గత వారం ఐపీఓకు వచ్చిన ఎస్‌బీఐ ఎఫ్‌ఎం ఈక్విటీలో ఎస్‌బీఐ తన 61 శాతం వాటా నుంచి ఐదు శాతం వాటాను విక్రయించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ అధీనంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!