Share News

ఆద్యంతం ఊగిసలాటలే..

ABN , Publish Date - May 08 , 2026 | 01:56 AM

రోజంతా లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. గురువారం ట్రేడింగ్‌ ముగిసేసరికి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో...

ఆద్యంతం ఊగిసలాటలే..

సెన్సెక్స్‌ 114 పాయింట్లు డౌన్‌

ముంబై: రోజంతా లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. గురువారం ట్రేడింగ్‌ ముగిసేసరికి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 671 పాయింట్ల శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్‌.. చివరికి 114 పాయింట్ల నష్టంతో 77,844.52 వద్దకు జారుకుంది. నిఫ్టీ 4.30 పాయింట్లు కోల్పోయి 24,326.65 వద్ద స్థిరపడింది. ఇరాన్‌-అమెరికా మధ్య చర్చలపై అనిశ్చితి, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారని మార్కెట్‌వర్గాలు పేర్కొన్నాయి.

రూ.2.17 లక్షల కోట్ల సంపద వృద్ధి

బ్లూచిప్‌లు ఒత్తిడికి లోనైనప్పటికీ చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లకు మాత్రం కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎ్‌సఈలోని మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీ 1.40 శాతం, స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌ ఇండెక్స్‌ 1.09 శాతం ఎగిశాయి. దాంతో బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.2.17 లక్షల కోట్లు పెరిగి రూ.474.97 లక్షల కోట్లకు (5.01 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.

ఇవి కూడా చదవండి..

భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Updated Date - May 08 , 2026 | 01:56 AM