79,000 పైకి సెన్సెక్స్
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:32 AM
స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ 79,000, నిఫ్టీ 24,500 కీలక స్థాయిలను అధిగమించాయి. మంగళవారం ట్రేడింగ్‌లో...
ముంబై: స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ 79,000, నిఫ్టీ 24,500 కీలక స్థాయిలను అధిగమించాయి. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 846.78 పాయింట్లు ఎగబాకి 79,367.08 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 753.03 పాయింట్ల లాభంతో 79,273.33 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 211.75 పాయింట్ల వృద్ధితో 24,576.60 వద్ద ముగిసింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు త్వరలోనే ప్రారంభం కావచ్చన్న ఆశావహంతో పాటు ముడిచమురు ధరలు కాస్త దిగిరావడం మార్కెట్ ర్యాలీకి దోహదపడింది. దాంతో బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్కరోజులో రూ.2.99 లక్షల కోట్లు పెరిగి రూ.468.67 లక్షల కోట్లకు చేరుకుంది.
అరబిందో ఫార్మా బైబ్యాక్ రేపు షురూ
హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా రూ.800 కోట్ల సొంత షేర్ల తిరిగి కొనుగోలు (బైబ్యాక్) ఆఫర్ ఈ నెల 23న (గురువారం) ప్రారంభమై 29న ముగియనుంది. బైబ్యాక్ ఆఫర్‌లో భాగంగా ఓపెన్ మార్కెట్ నుంచి కంపెనీకి చెందిన 54,23,728 ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటీ రూ.1,475 చొప్పున అరబిందో ఫార్మా కొనుగోలు చేయనుంది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌తో చర్చలకు రమ్మంటే వస్తా: డొనాల్డ్ ట్రంప్
భారతీయ వీసా దరఖాస్తుదారులు.. గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా..