Share News

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:49 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 1,164 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడిన సెన్సెక్స్‌.. చివరికి...

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..

సెన్సెక్స్‌ 508 పాయింట్లు పతనం

రూ.4.27 లక్షల కోట్ల సంపద ఆవిరి

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 1,164 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడిన సెన్సెక్స్‌.. చివరికి 508.40 పాయింట్ల నష్టంతో 74,267.34 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 165.15 పాయింట్లు కోల్పోయి 23,382.60 వద్ద ముగిసింది. అమ్మకాల హోరులో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.4.27 లక్షల కోట్లు తగ్గి రూ.460.70 లక్షల కోట్లకు (4.86 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో అప్రమత్తమైన మదుపరులు ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక సేవలు, వాహన రంగ షేర్లలో అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. ఐటీ షేర్లలో కొనుగోళ్లు సూచీల నష్టాలకు కొంత మేర అడ్డుకట్ట వేయగలిగాయి. కాగా, గడిచిన నాలుగు సెషన్లలో సెన్సెక్స్‌ 2,221.62 పాయింట్లు (2.90శాతం), నిఫ్టీ 649.1 పాయింట్లు (2.70 శాతం) నష్టపోయాయి.

ఇవి కూడా చదవండి...

ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం

Updated Date - Jun 02 , 2026 | 04:49 AM