మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్‌పై సెబీ పరిమితులు?
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:41 AM
స్టాక్ మార్కెట్‌ను మరింత సంస్కరించేందుకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ పై...
ముంబై: స్టాక్ మార్కెట్‌ను మరింత సంస్కరించేందుకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ (ఎంటీఎఫ్)పై పరిమితులు విధించాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక చర్చా పత్రం విడుదల చేసి అందరి అభిప్రాయాల ఆధారంగా ఈ పరిమితులు విధించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే దాదాపు జూదంగా మారిన మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్‌కు కొంతలో కొంతైనా చెక్ పడుతుందని భావిస్తున్నారు.
ఎంటీఎఫ్ అంటే: ఈ పద్ధతిలో చేతిలో పెద్దగా నగదు లేకపోయినా షేర్లలో ట్రేడింగ్ చేయవచ్చు. మదుపరుల వద్ద ఉన్న నగదుకు నాలుగు రెట్ల నిధులను బ్రోకరేజీ సంస్థలు అప్పుగా ఇస్తాయి. ఇందుకు 9 నుంచి 18 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తాయి. బ్రోకరేజీ సంస్థలు ఈ మొత్తంతో మదుపరుల తరపున షేర్లు కొని అమ్ముతుంటాయి. ఇందులో లాభం వస్తే వడ్డీ, ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని మదుపరులకు చెల్లిస్తారు. నష్టం వస్తే మదుపరులు మార్జిన్‌గా ఉంచిన అసలుకు కూడా గండి పడుతుంది.
పరిమితులు ఎందుకు: ప్రస్తుతం మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ దాదాపు రూ.1.53 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 29 శాతం ఎక్కువ. ఇందులో మూడింట రెండు వంతుల ఫండింగ్.. స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీల షేర్లలోనే జరిగింది. అనేక మంది రిటైల్ మదుపరులు ఈ కంపెనీల షేర్లలో మార్జిన్ ట్రేడింగ్ చేసి చేతులు కాల్చుకుంటున్నారు. దీంతో ఈ తరహా ట్రేడింగ్‌ను మొత్తంగా నిషేధించకుండా మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్‌ను, చలామణిలో ఉన్న ఆయా కంపెనీల షేర్ల (ఫ్రీ ఫ్లోటింగ్)లో 5 నుంచి 10 శాతం మించకుండా పరిమితులు విధించాలని సెబీ యోచిస్తున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..