ఓపికగా ఉండండి..
ABN , Publish Date - Mar 15 , 2026 | 05:32 AM
అనిశ్చిత సమయాల్లో ఓపికగా ఉండటమే ఉత్తమ వ్యూహమని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గడిచిన రెండు వారాల్లో....
సంక్షోభ సమయాల్లో అదే ఉత్తమ వ్యూహం
మార్కెట్ మదుపరులకు సెబీ చీఫ్ పాండే సలహా
అనిశ్చిత సమయాల్లో ఓపికగా ఉండటమే ఉత్తమ వ్యూహమని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గడిచిన రెండు వారాల్లో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైన నేపథ్యంలో ప్రధానంగా చిన్న మదుపరులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ, ఆ తర్వాత సూచీలు మళ్లీ కుదురుకుని ముందుకు సాగడం మనం చూశామన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన అనిశ్చితి నెలకొన్నప్పటికీ, మార్కెట్ స్థిరత్వం కోసం అంతర్జాతీయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆర్థిక మార్కెట్లో అనిశ్చితులు అసాధారణ సందర్భాలేమీ కాదని, పునరావృతమవుతూనే ఉంటాయి. సవాళ్ల సమయంలోనూ సాఫీగా, పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేయగలగడంలోనే వ్యవస్థ బలం దాగి ఉంది.
మన సంస్థలను బలోపేతం చేయడం, మార్కెట్ కార్యకలాపాల్లో మరింత మంది పాలుపంచుకునేందుకు చర్యలను చేపట్టడం, మంచి పాలన ప్రమాణాలను ఆచరించగలిగితే భారత క్యాపిటల్ మార్కెట్లు ప్రస్తుత అనిశ్చితులను ఎదుర్కొని ముందుకు సాగడంతో పాటు బలంగా నిలబడగలుగుతాయి.
అనిశ్చిత ప్రపంచంలో సమర్థవంతమైన క్యాపిటల్ మార్కెట్లు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నిలబెట్టడం, పారదర్శక ధరల ఆవిష్కృతం, ఆటుపోట్లను తట్టుకోడం ద్వారా స్థిరీకరణ పాత్రను పోషిస్తాయి.
ప్రస్తుతం మార్కెట్లు ఏ వార్తకైనా వెంటనే స్పందిస్తాయి. ఆ వేగం మార్కెట్ స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా చూడటమెలా అనే దానిపై విధానకర్తలు, మార్కెట్ వర్గాలు సతమతం అవుతున్నారు. కేవలం నియంత్రణ సంస్థలు మాత్రమే మార్కెట్లను సమర్థవంతంగా మార్చలేవు. ఇది సంబంధిత వర్గాలందరి ఉమ్మడి బాధ్యత.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే