ఇష్యూ ధరల శ్రేణి రూ.1,700-1,785
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:01 AM
దేశంలో అతిపెద్ద ఈక్విటీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ ఎస్ ఈ) తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈ నెల 17న ప్రారంభమై 21న ముగియనుంది. ఈ ఐపీఓలో ధరల శ్రేణిని...
రూ.22,569 కోట్లకు తగ్గిన ఆఫర్ సైజు
మార్కెట్ చరిత్రలో రెండో అతిపెద్ద ఐపీఓ
24న షేర్ల నమోదు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఈక్విటీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్ఈ) తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈ నెల 17న ప్రారంభమై 21న ముగియనుంది. ఈ ఐపీఓలో ధరల శ్రేణిని ఎన్‌ఎస్ఈ రూ.1,700-1,785గా నిర్ణయించింది. ఈ శ్రేణిలో కనిష్ఠ ధర ప్రకారంగా రూ.21,494 కోట్లు, గరిష్ఠ ధర ప్రకారంగా ఎక్స్ఛేంజీ రూ.22,569 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. అంటే, 2024 నాటి రూ.27,870 కోట్ల హ్యుండయ్ మోటార్ ఇండియా పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) తర్వాత రెండో అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్ ఇదే. 2022 నాటి రూ.21,000 ఎల్‌ఐసీ ఇష్యూతో పోలిస్తే మాత్రం అధికంగానే సమీకరించనుంది. ఐపీఓ అనంతరం ఎన్‌ఎ్‌సఈ తన షేర్లను ఈ నెల 24న మార్కెట్లో నమోదు చేయనుంది.
విక్రయ షేర్ల సైజు 15 శాతం తగ్గింపు
ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) మార్గంలో ఉండనుంది. ఎన్‌ఎ్‌సఈ ప్రస్తుత వాటాదారులు మొత్తం 12.64 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి సమర్పించిన ప్రాథమిక ముసాయిదా పత్రాల్లో (డీఆర్‌హెచ్‌పీ) ప్రతిపాదించిన 14.9 కోట్ల షేర్ల విక్రయంతో పాటు ఇష్యూ ధరల శ్రేణి అంచనా రూ.2,000-2,100 ప్రకారంగానైతే రూ.30,000 కోట్ల వరకు సమకూరేవి. కానీ, సెబీకి సమర్పించిన తుది ఐపీఓ పత్రాల (రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట్‌స-ఆర్‌హెచ్‌పీ) ప్రకారం.. కొందరు వాటాదారులు తమ షేర్ల విక్రయ సైజును 15 శాతం మేర తగ్గించుకోవడంతో మొత్తంగా ఆఫర్ సైజు కూడా తగ్గింది. ఈ ఆఫర్ పూర్తిగా ఓఎ్‌ఫఎస్ కావటంతో తద్వారా సమకూరే మొత్తం నిధులు వాటాదారుల జేబుల్లోకే వెళ్తాయి.

ఎన్ ఎస్ ఈ ఉద్యోగులకు రూ.170 డిస్కౌంట్
ఈ ఐపీఓలో భాగంగా ఎన్‌ఎ్‌సఈ... అర్హులైన తన ఉద్యోగుల కోసం రూ.70 కోట్ల విలువైన షేర్లను రిజర్వ్ చేసింది. అలాగే, ఒక్కో షేరుకు రూ.170 డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది.
వాటాదారులకు రూ.95,000 కోట్ల బొనాంజా!
ఈ ఐపీఓ ధరల శ్రేణిలో గరిష్ఠ స్థాయి ప్రకారంగా ఎన్‌ఎ్‌సఈలో వాటాదారులైన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, బీఓబీ సహా 20కి పైగా లిస్డెడ్ కంపెనీల వాటాల మొత్తం విలువ రూ.94,619 కోట్లకు చేరుకోనుంది. ఎన్‌ఎ్‌సఈలో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి ఉన్న 10.72 శాతం వాటా విలువ రూ.47,351 కోట్లకు చేరుకోనుంది. ఎల్‌ఐసీ సహా మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలు ఎన్‌ఎ్‌సఈలో మొత్తం 26.53 శాతం వాటా కలిగి ఉన్నాయి.
ఏడో అత్యంత విలువైన ఎక్స్ఛేంజీగా అవతరణ
ఈ ఐపీఓ ద్వారా ఎన్‌ఎ్‌సఈ మార్కెట్ విలువ రూ.4.4 లక్షల కోట్లకు చేరనుంది. అంటే, తన ప్రత్యర్థి ఎక్స్ఛేంజీ బీఎ్‌సఈ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1.31 లక్షల కోట్లతో పోలిస్తే మూడు రెట్ల కంటే అధికం. అంతేకాదు, ప్రస్తుత మారకం రేటు ప్రకారం ఎన్‌ఎ్‌సఈ మార్కెట్ విలువ అమెరికన్ కరెన్సీలో 4,618 కోట్ల డాలర్లకు చేరనుంది. తద్వారా ప్రపంచంలో ఏడో అత్యంత విలువైన ఎక్స్ఛేంజీగా అవతరించనుంది.
ఇవీ చదవండి:
ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్' వృద్ధి: మోదీ
పుతిన్-మోదీ ప్రయాణించిన కారు చలించే ఓ ఉక్కుకోట!