Share News

ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం వాటా విక్రయిస్తాం..

ABN , Publish Date - Aug 31 , 2026 | 02:27 AM

ప్రతిపాదిత రూ.30,000 కోట్ల నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ).. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ద్వారా 1 శాతం వాటా విక్రయించాలని చూస్తున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), దాని అనుబంధ సంస్థ...

ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం వాటా విక్రయిస్తాం..

ఎస్‌బీఐ, ఎస్‌బీఐ క్యాపిటల్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రతిపాదిత రూ.30,000 కోట్ల నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ).. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ద్వారా 1 శాతం వాటా విక్రయించాలని చూస్తున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), దాని అనుబంధ సంస్థ ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ వెల్లడించాయి. ఎన్‌ఎ్‌సఈ ఐపీఓ ద్వారా 0.65 శాతం వాటాను విక్రయించనున్నట్టు ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి తెలిపారు. అనుబంధ సంస్థ ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ కూడా 0.35 శాతం వాటాను విక్రయిస్తుందన్నారు. ప్రస్తుతం ఎన్‌ఎ్‌సఈలో ఎస్‌బీఐకి 3.23 శాతం, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌కు 4.33 శాతం వాటా ఉంది. కాగా సమీప భవిష్యత్తులో ఇతర అనుబంధ సంస్థలకు సంబంధించి ఎలాంటి నగదీకరణ ప్రణాళికలేదని శెట్టి తెలిపారు. గత నెలలో ఎస్‌బీఐ తన విదేశీ భాగస్వామ్య సంస్థ అముండితో కలిసి ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌లో సుమారు 10 శాతం వాటాను విక్రయించింది. కాగా హౌసింగ్‌ రుణాల విభాగంలో ప్రస్తుత త్రైమాసికంలో తమ మార్ట్‌గేజ్‌ పోర్ట్‌ఫోలియో రూ.10 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించే అవకాశం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి..

బ్యాంకులు, ఆసుపత్రులు, నైట్‌క్లబ్‌లలోనూ పెళ్లి రిజిస్ట్రేషన్.. చైనాలో ఎందుకిలా చేస్తున్నారంటే..

పెళ్లి రద్దు చేశారని దారుణం.. యువతి, ఆమె సోదరిపై యాసిడ్ దాడి..

Updated Date - Aug 31 , 2026 | 02:27 AM