Share News

ఐపీఓకి సత్య ఏజెన్సీస్‌

ABN , Publish Date - Apr 01 , 2026 | 02:23 AM

వినియోగ ఎలక్ర్టానిక్స్‌ రిటైలింగ్‌లోని సత్య ఏజెన్సీస్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) జారీకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు సమర్పించింది. ఇష్యూ ద్వారా...

ఐపీఓకి సత్య ఏజెన్సీస్‌

రూ.600 కోట్ల సమీకరణ లక్ష్యం

న్యూఢిల్లీ: వినియోగ ఎలక్ర్టానిక్స్‌ రిటైలింగ్‌లోని సత్య ఏజెన్సీస్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) జారీకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు సమర్పించింది. ఇష్యూ ద్వారా రూ.600 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యంగా తెలిపింది. ఇందులో రూ.300 కోట్ల విలువ గల తాజా షేర్లు జారీ చేయడంతో పాటు మరో రూ.300 ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా సమీకరించనున్నట్టు తెలియచేసింది. ప్రమోటర్లు జాన్సన్‌ అసారియా, జాన్‌ సత్య, చార్లెస్‌ పకియరాజ్‌ ఒక్కోక్కరు రూ.100 కోట్ల వంతున విలువ గల షేర్లు ఓఎ్‌ఫఎ్‌సలో విక్రయిస్తారని పేర్కొంది. ఇష్యూ ద్వారా సేకరించే నిధులు కొన్ని రుణాలు తీర్చడానికి వినియోగించనున్నట్టు తెలిపింది. తమిళనాడు కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటకల్లో రిటైల్‌ స్టోర్లు నడుపుతోంది. అలాగే జెట్వెర్క్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ బిజినెసెస్‌ కంపెనీ రూ.4,000-5,000 కోట్ల సమీకరణ లక్ష్యంగా ఐపీఓ జారీకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసింది.

ఇవీ చదవండి:

ఇండిగో కొత్త సీఈఓగా విలియమ్ వాల్ష్

మార్చి 31 డెడ్‌లైన్.. ఈ 3 పనులు వెంటనే పూర్తి చేయండి!

Updated Date - Apr 01 , 2026 | 02:23 AM