మార్కెట్లను మెప్పించని ఆర్‌బీఐ
ABN , Publish Date - Jun 06 , 2026 | 03:05 AM
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం బేరిష్ ట్రెండ్‌లోనే సాగాయి. ప్రస్తుత...
లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 117 పాయింట్లు డౌన్
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం బేరిష్ ట్రెండ్‌లోనే సాగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను తగ్గించటంతో పాటు ద్రవ్యోల్బణం 5.1 శాతానికి చేరే అవకాశం ఉందని ఆర్‌బీఐ ప్రకటించటంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగటమే ఇందుకు ప్రధాన కారణం. శుక్రవారం బీఎ్‌సఈ సెన్సెక్స్ ఆరంభంలో లాభాల్లో ప్రారంభమై డే గరిష్ఠ స్థాయి 74,717.57 పాయింట్లు, కనిష్ఠ స్థాయిలైన 73,998.75 పాయిం ట్ల మధ్య కదలాడింది. అనంతరం ఆర్‌బీఐ విధాన ప్రకటనతో మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటంతో చివరకు 116.67 పాయింట్ల నష్టంతో 74,243.34 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 49.85 పాయింట్ల నష్టంతో 23,366.70 వద్ద క్లోజైంది. శుక్రవారం తో ముగిసిన వారాంతానికి గాను సెన్సెక్స్ 532.4 పాయింట్లు, నిఫ్టీ 181.05 పాయింట్లు నష్టపోయాయి.
56 పైసలు లాభపడిన రూపాయి: విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక నిల్వలకు సంబంధించి ఆర్‌బీఐ సానుకూల చర్యలు ప్రకటించటంతో డాలర్ మారకంలో రూపాయి 56 పైసలు లాభపడి 95.18 వద్ద క్లోజైంది. ఒక దశలో ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 94.89ని తాకింది.
ఈ వార్తలనూ చదవండి:
కీలక వడ్డీరేట్లు యథాతథం.. రెపో రేటులో ఎలాంటి మార్పు లేదన్న ఆర్బీఐ
వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా..