Share News

టెక్‌ వ్యూ 22,500 వద్ద నిలదొక్కుకుంటేనే..

ABN , Publish Date - Apr 06 , 2026 | 02:37 AM

ఆరో వారం సైతం డౌన్‌ట్రెండ్‌ కొనసాగించిన నిఫ్టీ గత వారం 106 పాయింట్ల మేరకు నష్టపోయి 22,700 సమీపంలో ముగిసింది. టెక్నికల్‌గా గత వారం మైనర్‌ బౌన్స్‌బ్యాక్‌...

టెక్‌ వ్యూ 22,500 వద్ద నిలదొక్కుకుంటేనే..

ఆరో వారం సైతం డౌన్‌ట్రెండ్‌ కొనసాగించిన నిఫ్టీ గత వారం 106 పాయింట్ల మేరకు నష్టపోయి 22,700 సమీపంలో ముగిసింది. టెక్నికల్‌గా గత వారం మైనర్‌ బౌన్స్‌బ్యాక్‌ ఏర్పడింది. అయినప్పటికీ ఈ రికవరీలో ఎలాంటి సానుకూల సంకేతం వెలువడలేదు. ఈ కారణంగా స్వల్పకాలిక దశ స్పష్టం కావడానికి మరి కొంత కదలిక అవసరం. అయినప్పటికీ 2025 మార్చిలో నమోదైన కనిష్ఠ స్థాయి నుంచి రికవరీ సాధించడం ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం. గత ఏడాది కూడా ఈ స్థాయి నుంచి రికవరీ సాధించి 4,000 పాయింట్ల మేరకు ర్యాలీ సాధించింది. ప్రపంచ మార్కెట్ల ధోరణి ఆధారంగా ఈ వారం మార్కెట్‌ బలహీనంగానే ప్రారంభం కావచ్చు. కాని గత వారం 22,300 స్థాయిలో మూడు విడతలు రికవరీ సాధించినందువల్ల మరోసారి అది సాధిస్తుందా అన్నదే పరిశీలించాల్సిన అంశం.

బుల్లిష్‌ స్థాయిలు: బలహీనంగా ప్రారంభమైనా సానుకూలత కోసం 22,300 వద్ద నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 22,500. ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. ఆ పైన ప్రధాన నిరోధ స్థాయిలు 22,800, 23,000.

బేరిష్‌ స్థాయిలు: నిఫ్టీ 22,300 వద్ద విఫలమైతే మరింత బలహీనతగా భావించి అప్రమత్తం కావాలి. ప్రధాన మద్దతు స్థాయి 22,000. ఇక్కడ కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ డౌన్‌ట్రెండ్‌ కొనసాగించి 725 పాయింట్లు దిగజారినా కనిష్ఠ స్థాయిల నుంచి 1,500 పాయింట్ల మేరకు కోలుకుని 51,500 వద్ద ముగిసింది. మరింత బలహీనత ప్రదర్శించినా ప్రధాన మద్దతు స్థాయి 51,000 వద్ద కన్సాలిడేట్‌ అయి తీరాలి. మరింత బలహీనపడితే ప్రధాన మద్దతు స్థాయిలు 50,600, 50,000 వద్ద కన్సాలిడేట్‌ కావచ్చు.

పాటర్న్‌: రికవరీ కోసం 22,300 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద కోలుకుని తీరాలి. గత వారం డెయిలీ చార్టుల్లో ఓవర్‌సోల్డ్‌ స్థితిని సద్దుబాటు చేసుకుంది. కనిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేషన్‌ ఉండవచ్చుననేందుకు ఇది సంకేతం.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం: 22,500, 22,620

మద్దతు: 22,300, 22,160

వి. సుందర్‌ రాజా

ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 06 , 2026 | 02:37 AM