Share News

టెక్‌ వ్యూ 24,500 వద్ద స్వల్పకాలిక నిరోధం

ABN , Publish Date - Aug 03 , 2026 | 04:52 AM

నిఫ్టీ గత సోమవారం 230 పాయింట్ల బలమైన బౌన్స్‌బ్యాక్‌తో ప్రారంభమై తదుపరి ప్రధాన స్థాయి 24,000 వరకు వెళ్లిన తర్వాత మరింత అప్‌ట్రెండ్‌ను కొనసాగించింది. చివరకు గత శుక్రవారం 24,400 వరకు...

టెక్‌ వ్యూ 24,500 వద్ద స్వల్పకాలిక నిరోధం

నిఫ్టీ గత సోమవారం 230 పాయింట్ల బలమైన బౌన్స్‌బ్యాక్‌తో ప్రారంభమై తదుపరి ప్రధాన స్థాయి 24,000 వరకు వెళ్లిన తర్వాత మరింత అప్‌ట్రెండ్‌ను కొనసాగించింది. చివరకు గత శుక్రవారం 24,400 వరకు వెళ్లి వారంలో గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. అంతక్రితం వారంతో పోల్చితే గత వారంలో మార్కెట్‌ 616 పాయింట్ల (2.5 శాతం) లాభంతో ముగిసింది. మార్కెట్‌ మళ్లీ 24,500 స్థాయికి చేరువగా వస్తోంది. కాగా మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ గత వారంలో 1,300 పాయింట్ల ర్యాలీని కనబరిచి ప్రస్తుతం ప్రధాన నిరోధ స్థాయి అయిన 63,000కు చేరువలో ఉంది. మరికొద్ది రోజులు ఇక్కడ నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. మరోవైపు స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ గత వారంలో 460 పాయింట్ల (2.4 శాతం) ర్యాలీని కనబరిచి తదుపరి ప్రధాన నిరోధ స్థాయి అయిన 19,500కి సమీపంలో ఉంది. గత కొన్ని నెలల్లో ఇక్కడ నిలదొక్కుకోవడంలో విఫలమైంది.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ 570 పాయింట్ల మైనర్‌ ర్యాలీని కనబరిచి చివరకు 57,260 వద్ద ముగిసింది. కానీ ఇది ఇటీవలి గరిష్ఠ స్థాయి అయిన 58,700కు దిగువన ఉంది. ఒకవేళ పాజిటివ్‌ ట్రెండ్‌ ఏర్పడితే ఎగువన ప్రధాన నిరోధ స్థాయి 57,600 వద్ద ఉంటుంది. తదుపరి ప్రధాన నిరోధం 58,000 వద్ద ఉంటుంది. మరింత సానుకూల సంకేతం కోసం ఈ స్థాయి ఎగువన నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బలహీన పడితే దిగువన తదుపరి మద్దతు 56,600 వద్ద (గత వారం కనిష్ఠ స్థాయి) ఉంటుంది. అంతకంటే దిగువన తదుపరి ప్రధాన మద్దతు 56,000 వద్ద ఉంటుంది. ఈ స్థాయి వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైతే అది స్పల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.

బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ పాజిటివ్‌ ట్రెండ్‌లో కొనసాగితే ఎగువన 24500 వద్ద ప్రధాన నిరోధం ఎదురుకానుంది. ఈ ప్రధాన స్థాయి వద్ద గత కొన్ని నెలల్లో నిలదొక్కుకోవడంలో మార్కెట్‌ విఫలమైంది. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఈ ప్రధాన నిరోధం ఎగువన మార్కెట్‌ నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎగువన తదుపరి ప్రధాన నిరోధం 24,800. ఆపైన ప్రధాన నిరోధం 25,000 స్థాయి వద్ద ఉంటుంది.

బేరిష్‌ స్థాయిలు: ఒకవేళ నిఫ్టీ బలహీనపడితే దిగువన తదుపరి మైనర్‌ మద్దతు 24,180 వద్ద (గత గురువారపు కనిష్ఠం) ఉంటుంది. ఆ తర్వాత దిగువన ప్రధాన మద్దతు 24,000 వద్ద ఉంటుంది. ఒకవేళ ఈ మద్దతు స్థాయి వద్ద నిలదొక్కుకోవడంలో మార్కెట్‌ విఫలమైతే అది మరింత స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.


ప్యాటర్న్‌: గత వారం నిఫ్టీ ఆకస్మికంగా నిలువుగా అప్‌సైడ్‌ బౌన్స్‌బ్యాక్‌ ప్యాటర్న్‌ కనిపించినందున తదుపరి గరిష్ఠ నిరోధ స్థాయి 24,500 వద్ద కన్సాలిడేషన్‌ జరగాల్సి ఉంది. గత మూడు నెలల్లో వీక్లీ చార్ట్‌ల ప్రకారం మార్కెట్‌ 24,500 స్థాయి వద్ద మూడు ప్రధాన గరిష్ఠాలను నమోదు చేసింది. కాబట్టి స్వల్పకాలిక సానుకూల ట్రెండ్‌ కోసం ఈ ప్రధాన గరిష్ఠ స్థాయిని అధిగమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌ 200 రోజుల మూవింగ్‌ యావరేజెస్‌ ఇండికేటర్‌కు కాస్త దిగువన ఉంది. సానుకూల సంకేతం కోసం ఈ స్థాయి ఎగువన నిలదొక్కుకోవాల్సి ఉంటుంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24,500, 24,570

మద్దతు : 24,300, 24,180

వి. సుందర్‌ రాజా

ఈ వార్తలనూ చదవండి:

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 03 , 2026 | 04:52 AM