Share News

టెక్‌ వ్యూ: నిరోధం 24,500 సమీపంలో... కరెక్షన్‌కు ఆస్కారం

ABN , Publish Date - Apr 20 , 2026 | 02:26 AM

నిఫ్టీ ముందు వారంలో ఏర్పడిన అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ గత వారం మొత్తం మీద 300 పాయింట్లు పైగా లాభపడి 24,350 వద్ద ముగిసింది...

టెక్‌ వ్యూ: నిరోధం 24,500 సమీపంలో... కరెక్షన్‌కు ఆస్కారం

నిఫ్టీ ముందు వారంలో ఏర్పడిన అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ గత వారం మొత్తం మీద 300 పాయింట్లు పైగా లాభపడి 24,350 వద్ద ముగిసింది. నిఫ్టీ పునరుజ్జీవ పథంలో పయనించడం వరుసగా ఇది రెండో వారం. రెండు వారాల్లో 2,200 పాయింట్లు పైగా లాభపడింది. ఏప్రిల్‌ నెల మొత్తం మీద ఇప్పటివరకు 9ు లాభపడింది. మిడ్‌క్యాప్‌-100 సూచీ సైతం గత వారం 2,000 పాయింట్లకు పైగా ర్యాలీ సాధించి కీలక స్థాయి 60,000 చేరువలో ఉంది. స్మాల్‌క్యాప్‌-100 ఇండెక్స్‌ 725 పాయింట్లు లాభపడింది. రెండు వారాలుగా భారీ ర్యాలీ ఏర్పడిన నేపథ్యంలో కన్సాలిడేషన్‌ ఏర్పడడం తప్పనిసరి. పైగా మరోసారి కీలక నిరోధం 24,500 సమీపంలో కీలక కూడలిలో ఉంది.

బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం నిఫ్టీ 24,500 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 25,000.

బేరిష్‌ స్థాయిలు: రియాక్షన్‌కు గురైనా భద్రత కోసం ప్రధాన మద్దతు స్థాయి 24,000 వద్ద నిలదొక్కుకోవాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగవచ్చు. మరో ప్రధాన మద్దతు స్థాయిలు 23,500, 22,900.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 650 పాయింట్ల మేరకు లాభపడి 56,560 వద్ద ముగిసింది. గత రెండు వారాల్లో 6,500 పాయింట్ల మేరకు లాభపడింది. ప్రధాన నిరోధం 57,000. ట్రెండ్‌లో సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. అప్రమత్త ట్రెండ్‌ ప్రదర్శించి ప్రధాన మద్దతు స్థాయి 55,800 కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనగా భావించాలి.

పాటర్న్‌: మార్కెట్‌ ప్రస్తుతం 24,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ సమీపంలో ఉంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. అలాగే 24,000 కన్నా దిగువన ఏర్పడిన ‘‘కీలక సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద విఫలమైతే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుంది. గత రెండు వారాల్లో బలమైన బౌన్స్‌బ్యాక్‌ ఏర్పడిన నేపథ్యంలో పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌కు కూడా ఆస్కారం ఉంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్‌ రివర్సల్స్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24,500, 24,650

మద్దతు : 24,000, 23,840

వి. సుందర్‌ రాజా

ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 20 , 2026 | 02:26 AM