టెక్ వ్యూ 24,000 వద్ద అప్రమత్తత
ABN , Publish Date - May 04 , 2026 | 02:11 AM
నిఫ్టీ గత వారం 24,000 వద్ద సైడ్‌వేస్, కన్సాలిడేషన్ ట్రెండ్‌ను కనబరుస్తూ చివరకు వీక్లీ ప్రాతిపదికన స్వల్పంగా 99 పాయింట్ల లాభంతో క్లోజైంది. వారం కనిష్ఠ స్థాయిల్లో క్లోజయి ఎలాంటి...
టెక్ వ్యూ 24,000 వద్ద అప్రమత్తత
నిఫ్టీ గత వారం 24,000 వద్ద సైడ్‌వేస్, కన్సాలిడేషన్ ట్రెండ్‌ను కనబరుస్తూ చివరకు వీక్లీ ప్రాతిపదికన స్వల్పంగా 99 పాయింట్ల లాభంతో క్లోజైంది. వారం కనిష్ఠ స్థాయిల్లో క్లోజయి ఎలాంటి సంకేతాలు, కన్సాలిడేషన్ ట్రెండ్‌ను సూచించలేదు. స్పష్టమైన స్వల్పకాలిక దిశకు ఈ వారం ట్రేడింగ్ అత్యంత కీలకంగా ఉండనుంది. నిఫ్టీ గడచిన మూడు వారాలుగా 24,500 వద్ద బలమైన నిరోధాన్ని ఎదుర్కొంటోంది. నిఫ్టీ వరుసగా నాలుగో వారం 24,000 స్థాయిల వద్ద మరోసారి బలమైన పరీక్షను ఎదుర్కోనుంది. ఈ స్థాయిల వద్ద నిలకడగా ముగిస్తేనే అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 410 పాయింట్ల లాభంతో 60,000 దిగువన ముగియగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ 440 పాయింట్ల లాభంతో క్లోజైంది.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ సానుకూలత కోసం మైనర్ నిరోధ స్థాయిలైన 24,300 ఎగువన నిలదొక్కుకోవాలి. ఇక్కడ నిలదొక్కుకుంటే 24,500 ఎగువన తదుపరి నిరోధ స్థాయిలుంటాయి. స్వల్పకాలిక దిశను తీసుకునే ముందు ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్ కోసం 24,500-24,600 ఎగువన నిలదొక్కుకోవాలి.
బేరిష్ స్థాయిలు: ఒకవేళ రియాక్షన్‌ను కనబరిస్తే 23,800 వద్ద మైనర్ మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేక పోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 23,500 దిగువన ఉంటాయి. గత నెలలో ఈ స్థాయిల నుంచే రికవరీ కనబరిచింది. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 1,226 పాయింట్లు నష్టపోయి 54,860 వద్ద క్లోజైంది. సానుకూలత కోసం 55,500 ఎగువన నిలదొక్కుకోవాలి. ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 56,100. ఒకవేళ బలహీనతను సూచిస్తే 54,400 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ స్వల్పకాలిక బలహీనతకు అవకాశం ఉంది.
పాటర్న్: మార్కెట్ ప్రస్తుతం 50 రోజుల చలన సగటు వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొంటుంది. 24,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన ట్రెండ్‌లైన్’’ ఎగువన ఉంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. అలాగే 23,500 వద్ద డబుల్ బాటమ్‌ను ఏర్పరచుకుంది. ఇక్కడ విఫలమైతే మరింత బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్ రివర్సల్స్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం: 24,210, 24,300
మద్దతు : 23,800, 23,650
వి. సుందర్ రాజా
ఇవి కూడా చదవండి..
200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా
అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే