టెక్ వ్యూ 24,600 వద్ద నిరోధం..
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:16 AM
నిఫ్టీ గత వారం గరిష్ఠ స్థాయిలైన 24,600 వద్ద సానుకూలంగా ప్రారంభమై ఆ తర్వాత వెంటనే కరెక్షన్‌లోకి జారుకుంది. చివరకు 205 పాయింట్లు (0.8ు) నష్టపోయి వారం కనిష్ఠ స్థాయిలైన 24,360 వద్ద..
నిఫ్టీ గత వారం గరిష్ఠ స్థాయిలైన 24,600 వద్ద సానుకూలంగా ప్రారంభమై ఆ తర్వాత వెంటనే కరెక్షన్‌లోకి జారుకుంది. చివరకు 205 పాయింట్లు (0.8ు) నష్టపోయి వారం కనిష్ఠ స్థాయిలైన 24,360 వద్ద క్లోజైంది. గడచిన మూడు నెలలుగా నిరోధ స్థాయిలైన 24,600 వద్ద సైడ్‌వేస్ ట్రెండ్‌ను కొనసాగిస్తూ వస్తోంది. వీక్లీ చార్టుల ప్రకారం రివర్స్ డౌన్‌సైడ్ బ్రేక్‌డౌన్ ప్యాటర్న్‌ను సూచిస్తుండటంతో మరింత బలహీనతకు ఆస్కా రం ఉంది. మార్కెట్ ఈ వారంలో మరింత అప్రమత్త ట్రెండ్‌ను సూచించే అవకాశం ఉంది. కనిష్ఠ మద్దతు స్థాయిలైన 24,000 వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొనవచ్చు. టెక్నికల్‌గా చూస్తే మార్కెట్ మైనర్ కరెక్షన్ ట్రెండ్‌లో ఉంది. ఈ వారం సానుకూల ట్రెండ్ కోసం ప్రస్తుత స్థాయిల వద్ద పటిష్ఠతను సూచించాల్సి ఉంటుంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలైన 64,000 వద్ద కరెక్షన్‌ను కనబరచటంతో ప్రస్తుత గరిష్ఠ స్థాయిల వద్ద నిరోధాన్ని ఎదుర్కొనే వీలుం ది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ కూడా గరిష్ఠ స్థాయిలైన 20,000 వద్ద బలమైన కరెక్షన్‌కు లోనై 19,740 స్థాయిల వద్ద క్లోజైంది.
బుల్లిష్ స్థాయిలు: సానుకూల ట్రెండ్ కోసం మేజర్ నిరోధ స్థాయిలైన 24,600కన్నా పైన నిలదొక్కుకోవాలి. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన నిరోధ స్థాయిలు 24,800, 25,000.
బేరిష్ స్థాయిలు: నిఫ్టీ ఏదేనీ బలహీనతను సూచిస్తే 24,250 దిగువన మద్దతు స్థాయిలు ఉంటాయి. గత వారం ఈ స్థాయిల వద్దే మైనర్ రికవరీ సాధించింది. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే మ రింత బలహీనతను సూచిస్తుంది. తదుపరి మైనర్ మద్దతుస్థాయి 24,250 దిగువన ఉంటాయి. తదుపరి మేజర్ మద్దతు స్థాయి 23,900. సానుకూలత కోసం ఇక్కడ కచ్చితంగా నిలదొక్కుకోవాలి. ఒకవేళ ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండటం మంచిది.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ 255 పాయింట్లు నష్టపోయి 57,490 వద్ద క్లోజైంది. గత కొద్ది వారాలుగా ఈ సూచీ ప్రస్తుత నిరోధ స్థాయిలైన 58,000 వద్ద నిలదొక్కుకోలేక పోతోంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకుంటే తదుపరి ప్రధాన నిరోధస్థాయి 58,600. బలహీనతను సూచిస్తే 57,000 దిగువన మద్దతు స్థాయిలు ఉంటాయి. ఇక్కడ కూడా నిలదొక్కుకోలేకపోతే స్వల్పకాలిక బలహీతను సూచిస్తుంది.
పాటర్న్: నిఫ్టీ గత వారం 200 రోజుల సగటు నుంచి రియాక్షన్‌ను కనబరిచింది. సానుకూలత కోసం 24,600 వద్ద గతంలో ఏర్పరచుకున్న ‘ట్రిపుల్ టాప్’ పాటర్న్‌ను బ్రేకౌట్ సాధించాల్సి ఉంటుంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 24,520, 24,600
మద్దతు : 24,250, 24,160
వార్తలు కూడా చదవండి...
జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు