టెక్ వ్యూ కీలక నిరోధానికి చేరువలో...
ABN , Publish Date - Feb 09 , 2026 | 05:12 AM
గత వారం నిఫ్టీ బలమైన పునరుజ్జీవంతో కీలక నిరోధం 26,000 దాటినా గరిష్ఠ స్థాయిల నుంచి రియాక్షన్ సాధించింది. అయినా ముందు వారంతో పోల్చితే...
గత వారం నిఫ్టీ బలమైన పునరుజ్జీవంతో కీలక నిరోధం 26,000 దాటినా గరిష్ఠ స్థాయిల నుంచి రియాక్షన్ సాధించింది. అయినా ముందు వారంతో పోల్చితే 870 పాయింట్ల లాభంతో 25,690 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్-100 సూచీ 2,400 పాయింట్లు, స్మాల్‌క్యాప్-100 సూచీ 520 పాయింట్ల మేరకు ర్యాలీ సాధించాయి. మార్కెట్ గత కొద్ది నెలలుగా గరిష్ఠ స్థాయి 26,300 వద్ద గట్టి నిరోధాన్ని ఎదుర్కొంటూ నిలదొక్కుకోవడంలో విఫలమవుతోంది. ఈ కారణంగా 26,000 వద్ద మరింత అప్రమత్తత అవసరం. గత వారం ఈ స్థాయిలో నిట్టనిలువుగా పునరుజ్జీవం ఏర్పడిన కారణంగా కూడా కన్సాలిడేషన్ తప్పనిసరి. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌ను బట్టి ఈ వారం మార్కెట్ బలంగానే ప్రారంభం కావచ్చు.
బుల్లిష్ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమించాలంటే నిఫ్టీ ప్రధాన నిరోధం 25,900 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 26,000. ఇక్కడ కన్సాలిడేషన్ ఉండవచ్చు.
బేరిష్ స్థాయిలు: గరిష్ఠ స్థాయిల్లో నిలదొక్కుకోలేక పోయినా ట్రెండ్‌లో సానుకూలత కోసం మద్దతు స్థాయి 25,750 వద్ద నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే బలహీనతకు ఆస్కారం ఉంటుంది. ప్రధాన మద్దతు స్థాయి 25,500. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక బలహీనతగా భావించి అప్రమత్తం కావాలి.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ 1,700 పాయింట్ల మేరకు ర్యాలీ సాధించింది. జీవితకాల గరిష్ఠ స్థాయి 61,700 వరకు వెళ్లినా బలమైన రియాక్షన్‌లో 60,120 వద్ద ముగిసింది. మేజర్ టాప్ 60,430 కన్నా కూడా దిగువనే క్లోజయింది. రికవరీ బాట పడితే తదుపరి నిరోధం 60,700 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 61,200. మానసిక అవధి 60,000 వద్ద నిలదొక్కుకోలేకపోతే బలహీనత సంకేతం ఇస్తుంది.
పాటర్న్: గత వారం నిఫ్టీ కీలకమైన 200 డిఎంఏ వద్ద బౌన్స్‌బ్యాక్ అయింది. ప్రస్తుతం 100 డిఎంఏ వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. అలాగే గత వారం ఓవర్‌సోల్డ్ స్థితి నుంచి కోలుకుంది. ప్రస్తుతం నిఫ్టీకి 26,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద నిరోధం ఉంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్ రివర్సల్స్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం: 25,900, 26,000
మద్దతు: 25,750, 25,660
వి. సుందర్ రాజా
ఇవి కూడా చదవండి
షేర్వానీ వేసుకో.. రూబీ టోపీ పెట్టుకో
బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నేత రమేశ్ చంద్ర పోలీసు కస్టడీలో మృతి