టెక్ వ్యూ 24,000 వద్ద నిలదొక్కుకుంటేనే..
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:28 AM
నిఫ్టీ గత వారం ఆరంభంలోనే 200 పాయింట్ల మేర నష్టపోయి 24,200 స్థాయిలకు పడిపోయి మరోసారి అప్రమత్తతను సూచించింది. నిఫ్టీ గతవారం అంతా డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ చివరికి...
నిఫ్టీ గత వారం ఆరంభంలోనే 200 పాయింట్ల మేర నష్టపోయి 24,200 స్థాయిలకు పడిపోయి మరోసారి అప్రమత్తతను సూచించింది. నిఫ్టీ గతవారం అంతా డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ చివరికి వీక్లీ ప్రాతిపదికన 570 పాయింట్లు (2.33 శాతం) నష్టపోయి 23,770 వద్ద క్లోజైంది. గడచిన మూడు నెలలుగా ఉన్న దీర్ఘకాల సైడ్‌వేస్ ట్రెండ్‌ను కొనసాగిస్తూ వచ్చింది. నిఫ్టీ గత శుక్రవారం ఇంట్రాడేలో 23,600 కనిష్ఠ స్థాయుల నుంచి 160 పాయింట్ల మేర బలమైన రికవరీ సాధించి సానుకూలతను వెలువరించింది. ప్రస్తుతం ప్రధాన స్థాయిలైన 24,000 వద్ద మరోసారి గట్టి పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక్కడ నిలదొక్కుకుంటేనే అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా 800 పాయింట్లు నష్టపోయి శుక్రవారం బలమైన రికవరీ సాధించింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ కూడా 420 పాయింట్లు నష్టపోయి రికవరీ కనబరిచింది.
బుల్లిష్ స్థాయిలు: సానుకూల ట్రెండ్ కోసం మేజర్ నిరోధ స్థాయిలైన 24,000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. అప్‌ట్రెండ్ కోసం ఈ స్థాయిలకు ఎగువన నిలదొక్కుకోవాలి. తదుపరి దిశను తీసుకునే ముందు ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. తదుపరి ప్రధాన నిరోధ స్థాయిలు 24,300, 24,500.
బేరిష్ స్థాయిలు: నిఫ్టీ ఏదేనీ బలహీనతను సూచిస్తే 23,600 దిగువన మద్దతు స్థాయిలు ఉంటాయి. గత శుక్రవారం ఈ స్థాయిల వద్దే బలమైన రికవరీ సాధించింది. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. తదుపరి మైనర్ మద్దతు స్థాయి 23,400 దిగువన ఉంటాయి. ఇది జూన్ 12న ఏర్పడిన కనిష్ఠ స్థాయి. తదుపరి మేజర్ మద్దతు స్థాయి 23,000. ఇక్కడ స్వల్పకాలిక కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ 1,800 పాయింట్లు నష్టపోయి వారం కనిష్ఠ స్థాయిలైన 56,700 వద్ద క్లోజైంది. ఒకవేళ ఈ వారం మైనర్ రికవరీ కనబరిస్తే 57,200 వద్ద నిరోధ స్థాయిలుంటాయి. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. బలహీనతను సూచిస్తే 56,500 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ కూడా విఫలమైతే 56,000 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా వ్యవహరించాలి.
పాటర్న్: నిఫ్టీ గత వారం బుల్-ట్రాప్ ప్యాట్రన్‌తో ఒక్కసారిగా డౌన్‌సైడ్ రివర్సల్‌లోకి జారుకుంది. గత వారం నిట్టనిలువుగా పడిపోయి కన్సాలిడేషన్‌ను సూచించింది. 23,600 వద్ద మైనర్ బాటమ్‌ను ఏర్పరచుకుంది. డౌన్‌సైడ్ బ్రేక్‌డౌన్‌లో ఉన్న మార్కెట్ సానుకూలత కోసం వచ్చే కొద్ది రోజులు కచ్చితంగా నిలదొక్కుకోవాలి. ప్రస్తుతం మార్కెట్ 24,000 స్థాయిల వద్ద 50, 100 రోజుల మూవింగ్ యావరేజె్‌సకు స్వల్ప దిగువన ఉంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం గురువారం మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 23,880, 24,000
మద్దతు : 23,690, 23,600
వి. సుందర్ రాజా
ఇవి కూడా చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం
అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు