టెక్ వ్యూ 24,000 వద్ద నిలదొక్కుకుంటేనే..
ABN , Publish Date - May 11 , 2026 | 01:59 AM
నిఫ్టీ గత వారం సైడ్‌వేస్ ట్రెండ్‌ను కొనసాగిస్తూ చివరకు వీక్లీ ప్రాతిపదికన 180 పాయింట్లు (0.7ు) లాభపడింది. ఎలాంటి సంకేతాలు వెలువరించకుండా 24,176 వద్ద క్లోజైంది. నిఫ్టీ గత వారం...
టెక్ వ్యూ : 24,000 వద్ద నిలదొక్కుకుంటేనే..
నిఫ్టీ గత వారం సైడ్‌వేస్ ట్రెండ్‌ను కొనసాగిస్తూ చివరకు వీక్లీ ప్రాతిపదికన 180 పాయింట్లు (0.7ు) లాభపడింది. ఎలాంటి సంకేతాలు వెలువరించకుండా 24,176 వద్ద క్లోజైంది. నిఫ్టీ గత వారం 24,500-23,800 మధ్యన కదలాడింది. ప్రధాన నిరోధ స్థాయిలైన 24,500 వద్ద నిలదొక్కుకోవటంలో విఫలమైంది. గడచిన నాలుగు వారాలుగా ఈ స్థాయిల వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొంటోంది. అంతేకాకుండా గరిష్ఠ స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడిని సూచిస్తోంది. నిఫ్టీకి ఈ వారం కీలకంగా ఉండనుంది. ఈ వారం గరిష్ఠ స్థాయిల వద్ద నిలకడగా ముగియాల్సి ఉంటుంది. గత వారం మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3.5 శాతం ర్యాలీని సాధించి ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలైన 62,200 వద్ద క్లోజైంది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ కూడా 4 శాతం మేర లాభపడింది. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు బలమైన ర్యాలీని కనబరచటంతో గరిష్ఠ స్థాయిల వద్ద కన్సాలిడేషన్‌కు అవకాశాలున్నాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ సానుకూలత కోసం మైనర్ నిరోధ స్థాయిలైన 24,500 ఎగువన నిలదొక్కుకోవాలి. ఇక్కడ నిలదొక్కుకుంటే 24,800 ఎగువన తదుపరి నిరోధ స్థాయిలుంటాయి. తదుపరి నిరోధ స్థాయి 25,000. స్వల్పకాలిక దిశను తీసుకునే ముందు ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది.
బేరిష్ స్థాయిలు: ఒకవేళ రియాక్షన్‌ను కనబరిస్తే 24,000 వద్ద మైనర్ మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేక పోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 23,800 దిగువన ఉంటాయి. తదుపరి మద్దతు స్థాయి 23,500.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 440 పాయింట్లు లాభపడి 55,310 వద్ద క్లోజైంది. కొద్ది వారాలుగా 56,000 స్థాయిల వద్ద అప్రమత్తతను సూచిస్తోంది. ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. అయితే ఇక్కడ కచ్చితంగా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. తదుపరి ప్రధాన నిరోధం 56,500. ఒకవేళ బలహీనతను సూచిస్తే మద్దతు స్థాయిలు 54,800 వద్ద ఉంటాయి. ఇక్కడ బలహీనతకు ఆస్కారం ఉంది. తదుపరి మద్దతు స్థాయి 54,000 దిగువన ఉంటుంది.
ప్యాటర్న్: మార్కెట్ ప్రస్తుతం 50 రోజుల చలన సగటు వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొంటుంది. స్వల్పకాలిక మూవ్‌మెంట్‌కు అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండటం మంచిది. 24,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన ట్రెండ్‌లైన్’’ ఎగువన ఉంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. అలాగే 24,000 వద్ద ట్రిపుల్ బాటమ్‌ను ఏర్పరచుకుంది. ఇక్కడ విఫలమైతే మరింత బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్ రివర్సల్స్ ఉండవచ్చు.
వి. సుందర్ రాజా
ఈ వార్తలనూ చదవండి:
'స్మార్ట్' గా ఆలోచిస్తే గృహ రుణాల్లో బోలెడు ఆదా