Share News

టెక్‌ వ్యూ మద్దతు స్థాయి 23,500

ABN , Publish Date - May 18 , 2026 | 03:17 AM

నిఫ్టీ గత వారం కరెక్షన్‌లో సాగుతూ చివరకు వీక్లీ ప్రాతిపదికన 530 పాయింట్ల నష్టంతో 23,643 వద్ద క్లోజైంది. తొలుత 900 పాయింట్లకు పైగా నష్టపోయి కనిష్ఠ స్థాయిలైన...

టెక్‌ వ్యూ మద్దతు స్థాయి 23,500

నిఫ్టీ గత వారం కరెక్షన్‌లో సాగుతూ చివరకు వీక్లీ ప్రాతిపదికన 530 పాయింట్ల నష్టంతో 23,643 వద్ద క్లోజైంది. తొలుత 900 పాయింట్లకు పైగా నష్టపోయి కనిష్ఠ స్థాయిలైన 23,300 పాయింట్ల నుంచి స్వల్పంగా కోలుకుంది. గడిచిన మూడు వారాలుగా సైడ్‌వేస్‌ ట్రెండ్‌ను కనబరిచిన మార్కెట్‌ గత వారం డౌన్‌సైడ్‌ బ్రేకౌట్‌ను చవిచూసింది. దీంతో మరింత స్వల్పకాలిక బలహీనతకు ఆస్కారం ఏర్పడింది. ఈ వారం నిఫ్టీ 24,000 స్థాయిల వద్ద నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. ఒకవేళ మైనర్‌ రికవరీ కనబరిస్తే మాత్రం కనిష్ఠ స్థాయిలైన 23,500 వద్ద బలమైన మద్దతు స్థాయిలు ఉంటాయి. టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీ ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకుంటేనే పాజిటివ్‌ ట్రెండ్‌ను కనబరుస్తుందా.. లేదా అనేది తేలుతుంది.

గత వారం మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా 2.1 శాతం (1,300 పాయింట్లు) నష్టపోయి గరిష్ఠ స్థాయిల నుంచి బలమైన రియాక్షన్‌ను చవిచూసింది. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా 850 పాయింట్ల (4.5 శాతం) మేర నష్టపోయింది. ఈ రెండు ఇండెక్స్‌లు గడచిన కొద్ది వారాలుగా కనబరుస్తున్న స్వల్పకాలిక ర్యాలీకి బ్రేక్‌ ఇచ్చాయి.

బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ సానుకూలత కోసం ప్రస్తుత మద్దతు స్థాయిలైన 23,500 వద్ద కచ్చితంగా నిలదొక్కుకోవాలి. ఇక్కడ నిలదొక్కుకుంటే 24,200 ఎగువన తదుపరి నిరోధ స్థాయిలుంటాయి. స్వల్పకాలిక సానుకూలత ఇక్కడ నిలదొక్కుకోవాలి.

బేరిష్‌ స్థాయిలు: ఒకవేళ బలహీతను కనబరిస్తే 23,500 వద్ద పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక్కడ నిలదొక్కుకోలేక పోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 23,250 దిగువన ఉంటాయి. తదుపరి మద్దతు స్థాయి 23,000. తదుపరి దిశను తీసుకునే ముందు ఇక్కడ స్వల్పకాలిక కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది.


బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 1,600 పాయింట్లు (2.9 శాతం) నష్టపోయి 53,700 వద్ద క్లోజైంది. మరింత బలహీనతను సూచిస్తే స్వల్పకాలిక మద్దతు స్థాయిలు 53,000 దిగువన ఉంటాయి. గత వారం ఈ స్థాయిల నుంచి రికవరీ కనబరిచింది. సానుకూలత కోసం కచ్చితంగా ఇక్కడ నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. తదుపరి మైనర్‌ మద్దతు స్థాయి 53,600. ప్రధాన నిరోధ స్థాయి 54,200.

పాటర్న్‌: వీక్లీ చార్టులపై మరింత డౌన్‌సైడ్‌ బ్రేక్‌ డౌన్‌ ప్యాట్రన్‌ కనిపిస్తుంటంతో స్వల్పకాలిక బలహీనతకు అవకాశం ఉంది. మార్కెట్‌ గతవారం 50, 100 రోజుల చలన సగటు దిగువకు చేరటంతో అప్రమత్తతను సూచిస్తోంది. రక్షణ కోసం 23,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకోవాల్సి ఉంటుంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్‌ రివర్సల్స్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం: 23,610, 23,700

మద్దతు : 23,500, 23,380

వి. సుందర్‌ రాజా

ఈ వార్తలనూ చదవండి:

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

బంగారంలో పెట్టుబడులకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఈజీఆర్‌లు

Updated Date - May 18 , 2026 | 03:17 AM