టెక్ వ్యూ 24,100 వద్ద నిరోధం..
ABN , Publish Date - Jun 15 , 2026 | 05:23 AM
నిఫ్టీ గత వారం బలహీనంగా ప్రారంభమై 23,000 కనిష్ఠ స్థాయిలకు చేరుకుని రికవరీని కనబరిచింది. గత శుక్రవారం 460 పాయింట్ల పటిష్ఠమైన ర్యాలీతో పాజిటివ్ ట్రెండ్‌ను సూచించింది. నిఫ్టీ...
నిఫ్టీ గత వారం బలహీనంగా ప్రారంభమై 23,000 కనిష్ఠ స్థాయిలకు చేరుకుని రికవరీని కనబరిచింది. గత శుక్రవారం 460 పాయింట్ల పటిష్ఠమైన ర్యాలీతో పాజిటివ్ ట్రెండ్‌ను సూచించింది. నిఫ్టీ.. వీక్లీ ప్రాతిపదికన 256 పాయింట్ల లాభంతో 23,620 స్థాయిల్లో క్లోజైంది. పలు వారాల కన్సాలిడేషన్ అనంతరం నిఫ్టీ వారం గరిష్ఠ స్థాయిలో క్లోజయి సానుకూల సంకేతాలు వెలువరించింది. గత శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియటంతో ఈ వారం దేశీయ మార్కెట్లు పాజిటివ్ ట్రెండ్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే నిఫ్టీ 24,000-24,100 వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొనే వీలుంది. టెక్నికల్‌గా చూస్తే 24,100 పాయింట్ల వద్ద నిలదొక్కుకుంటేనే సానుకూల ట్రెండ్‌ను కొనసాగిస్తుందా లేదా అనేది తేలుతుంది. మరోవైపు మిడ్‌క్యాప్ ఇండెక్స్ గత శుక్రవారం 1,440 పాయింట్ల బలమైన ర్యాలీతో సానుకూల ట్రెండ్‌ను సూచిస్తోంది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ కూడా పటిష్టమైన రివర్సల్‌ను కనబరిచి సానుకూల సంకేతాలు వెలువరిస్తోంది.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ సానుకూల ట్రెండ్ కోసం మైనర్ నిరోధ స్థాయిలైన 23,900 వద్ద నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 24,100. ఇది రెండు నెలల క్రితం ఏర్పడిన ప్రధాన నిరోధ స్థాయి. ప్రధాన మానసిక అవధి స్థాయిలైన 24,100 వద్ద స్వల్పకాలిక కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాల్సి ఉంటుంది.
బేరిష్ స్థాయిలు: నిఫ్టీ ఏదేనీ బలహీనతను సూచిస్తే 23,500 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. సత్వర అప్‌ట్రెండ్ అవకాశాలు, రక్షణ కోసం ఇక్కడ కచ్చితంగా నిలదొక్కుకోవాలి. లేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది. తదుపరి మద్దతు స్థాయిలు 23,300, 23,000.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గతవారం బుల్లిష్ ట్రెండ్‌లో సాగుతూ రికార్డు స్థాయిలో 2,300 పాయింట్ల లాభంతో 56,810 వద్ద క్లోజైంది. ఇది ఏప్రిల్‌లో ఏర్పడిన గరిష్ఠ స్థాయి. పాజిటివ్ ట్రెండ్‌ను కనబరిస్తే 57,500 ఎగువన నిరోధం ఉంటుంది. ఏప్రిల్ 21న ఏర్పడిన ఈ గరిష్ఠ స్థాయిల వద్ద నిలదొక్కుకోలేక డౌన్‌ట్రెండ్‌లోకి జారుకుంది. తదుపరి దిశను తీసుకునే ముందు ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. ఒకవేళ బలహీనతను సూచిస్తే 57,000 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది.
పాటర్న్: వీక్లీ చార్టుల ప్రకారం నిఫ్టీ.. అప్‌వర్డ్ రివర్సల్ బార్ ప్యాట్రన్‌ను కనబరిచి సానుకూల సంకేతాలు వెలువరిస్తోంది. 24,100 వద్ద డబుల్ టాప్ ప్యాట్రన్‌ను ఏర్పరచుకుంది. పాజిటివ్ ట్రెండ్ కోసం 24,100 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్ రివర్సల్స్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 23,840, 23,900 మద్దతు : 23,700, 23,620
వి. సుందర్ రాజా
ఇవీ చదవండి:
AIADMKకి సినీ నటి గౌతమి రాజీనామా
అన్‌స్టాపబుల్‌గా అమరావతి నిర్మాణం.. మంత్రి లోకేశ్ వీడియో పోస్ట్