Share News

మళ్లీ 24,000 పైకి నిఫ్టీ

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:16 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 347.14 పాయింట్లు బలపడి 77,155.62 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 96.55 పాయింట్ల వృద్ధితో.

మళ్లీ 24,000 పైకి నిఫ్టీ

  • వరుసగా నాలుగో రోజూ లాభాల్లో మార్కెట్లు

  • 4 సెషన్లలో రూ.22.78 లక్షల కోట్ల సంపద వృద్ధి

  • 5 లక్షల కోట్ల డాలర్లకు బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 347.14 పాయింట్లు బలపడి 77,155.62 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 96.55 పాయింట్ల వృద్ధితో 24,085.70 వద్ద ముగిసింది. అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం నేపథ్యంలో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుతూ వస్తుండటం ఇందుకు దోహదపడింది. కొనుగోళ్ల జోరు కొనసాగడంతో ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ మరో రూ.2.88 లక్షల కోట్లు పెరిగి రూ.475.12 లక్షల కోట్లకు చేరుకుంది. అమెరికన్‌ కరెన్సీలో ఈ విలువ మళ్లీ 5 లక్షల కోట్ల డాలర్లు దాటింది. కాగా, గడచిన నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 3,323.07 పాయింట్లు (4.50 శాతం), నిఫ్టీ 924.1 పాయింట్లు (3.98 శాతం) బలపడ్డాయి. మార్కెట్‌ సంపద రూ.22.78 లక్షల కోట్ల మేర పెరిగింది.

భారీగా తగ్గిన బంగారం, వెండి

విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9ు స్వచ్ఛత) బంగారం రేటు రూ.4,800 తగ్గి రూ.1,54,400కు దిగివచ్చింది. కిలో వెండి రూ.5,300 తగ్గుదలతో రూ.2,55,400కు పడిపోయింది. అంతర్జాతీయ విపణిలో వీటి ధరలు తగ్గడంతోపాటు రూపాయి బలపడటం ఇందుకు కారణం. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒకదశలో 4,327 డాలర్లు, సిల్వర్‌ 69.89 డాలర్లకు దిగివచ్చాయి.

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 05:16 AM