టెక్ వ్యూ కరెక్షన్ బాటలోనే..!
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:23 AM
గత వారం నిఫ్టీ ఆరంభం నుంచి బలహీనతను ప్రదర్శిస్తూ 500 పాయింట్లకు పైగా పతనమైంది. మద్దతు స్థాయి 25,000 కన్నా దిగువకు చేరి మరింత కరెక్షన్‌ను సూచించింది. ఒక దశలో 24,300 వద్ద స్వల్ప రికవరీ...
గత వారం నిఫ్టీ ఆరంభం నుంచి బలహీనతను ప్రదర్శిస్తూ 500 పాయింట్లకు పైగా పతనమైంది. మద్దతు స్థాయి 25,000 కన్నా దిగువకు చేరి మరింత కరెక్షన్‌ను సూచించింది. ఒక దశలో 24,300 వద్ద స్వల్ప రికవరీ కనబరిచినప్పటికీ నిలదొక్కుకోలేక పోయింది. చివరకు వీక్లీ ప్రాతిపదికన 730 పాయింట్లు (2.9 శాతం) నష్టపోయి 24,450 పాయింట్ల వద్ద క్లోజైంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా 1,700 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 430 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ గత కొద్ది వారాలుగా డౌన్‌ట్రెండ్‌ను కనబరుస్తూ 26,300 గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 2,000 పాయింట్లు నష్టపోయి ప్రస్తుతం 24,300 స్థాయికి పడిపోయింది. కొద్ది రోజులుగా నిఫ్టీ ఈ స్థాయి వద్ద కనిష్ఠ స్థాయిలను ఏర్పరచుకుంది. 2025 ఆగస్టులో ఏర్పడిన మేజర్ బాటమ్ స్థాయి కూడా ఇదే.
అంతర్జాతీయ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే నిఫ్టీ 24,300 స్థాయి వద్ద మరోసారి గట్టి పరీక్షను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన ట్రెండ్ ఇంకా బలహీనంగా ఉంది. వచ్చే కొద్ది రోజులు ఈ స్థాయి వద్ద నిలదొక్కుకుంటే సానుకూల ట్రెండ్‌ను కనబరుస్తుందా లేదా అనేది తేలుతుంది.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ తదుపరి మద్దతు స్థాయిలైన 24,300 వద్ద కచ్చితంగా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రికవరీ కనబరిస్తే తదుపరి నిరోధ స్థాయి 24,500. ఇక్కడ నిలదొక్కుకుంటేనే సానుకూల సంకేతాలు వెలువరిస్తుంది.
బేరిష్ స్థాయిలు: మద్దతు స్థాయిలైన 24,300 వద్ద నిలదొక్కుకోలేక పోతే మరింత బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండటం మంచిది. తదుపరి మద్దతు స్థాయి 24,000 దిగువన ఉంటుంది. గత ఏడాది మే నెలలో ఈ స్థాయిల నుంచే ర్యాలీ ప్రారంభమైంది. ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశాలున్నాయి.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 2,750 పాయింట్లు (4.5 శాతం) నష్టపోయి 57,780 వద్ద క్లోజైంది. ఏడాది తర్వాత బ్యాంక్ నిఫ్టీకి ఇదే అతిపెద్ద డౌన్‌ట్రెండ్. ఇక్కడ స్వల్పకాలిక బలహీనతను అవకాశం ఉంది. తదుపరి మద్దతు స్థాయి 57,000. ఇది ఐదు నెలల కనిష్ఠ స్థాయి. సానుకూలత కోసం ఇక్కడ కచ్చితంగా కన్సాలిడేటెడ్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతన సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఏదేనీ రికవరీ కనబరిస్తే మాత్రం 58,000 ఎగువన నిరోధ స్థాయిలుఉంటాయి.
పాటర్న్: మార్కెట్ స్వల్పకాలిక ఓవర్‌సోల్డ్ పొజిషన్‌లోకి జారుకుంది. రికవరీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా పతనమవుతూ వస్తున్న మార్కెట్ ప్రస్తుతం మద్దతు స్థాయిలను వెతుక్కుంటోంది. సానుకూలత కోసం 24,500 స్థాయిలో ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. అలాగే డౌన్‌సైడ్‌లో 24,300 వద్ద మద్దతు స్థాయిలున్నాయి. సానుకూలత కోసం ఇక్కడ కొద్ది రోజులు పటిష్ఠతను సూచించాల్సి ఉంటుంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం బుధవారం మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 24,450, 24,500
మద్దతు : 24,300, 24,240
వి. సుందర్ రాజా
ఈ వార్తలూ చదవండి:
బొగ్గులా నల్లగా దోశ.. రెస్టారెంట్ ప్రయోగం వైరల్
కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఇంటి ముందు వ్యక్తి డ్యాన్స్! ఎందుకో తెలిస్తే..