Share News

టెక్‌ వ్యూ 24,000 వద్ద కన్సాలిడేషన్‌!

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:21 AM

నిఫ్టీ గత వారం పాజిటివ్‌ ప్రారంభమై 23,600 పాయిం ట్ల నుంచి 24,100 పాయింట్ల వరకు వెళ్లింది. వారాంతంలో 155 పాయింట్ల నష్టంతో చివరకు 24,013 పాయింట్ల వద్ద క్లోజైంది. వీక్లీ ప్రాతిపదికన మాత్రం...

టెక్‌ వ్యూ 24,000 వద్ద కన్సాలిడేషన్‌!

టెక్‌ వ్యూ

24,000 వద్ద కన్సాలిడేషన్‌!

నిఫ్టీ గత వారం పాజిటివ్‌ ప్రారంభమై 23,600 పాయిం ట్ల నుంచి 24,100 పాయింట్ల వరకు వెళ్లింది. వారాంతంలో 155 పాయింట్ల నష్టంతో చివరకు 24,013 పాయింట్ల వద్ద క్లోజైంది. వీక్లీ ప్రాతిపదికన మాత్రం 390 పాయింట్ల మేర లాభపడింది. నిఫ్టీ గత వారం మధ్యలోని గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల శ్రేణిలో ముగిసి అనిశ్చిత ట్రెండ్‌ను సూచిస్తోంది. ఈ వారం 24,200 పాయింట్ల వద్ద బలమైన నిరోధాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అప్రమత్త సెంటిమెంట్‌తో నిఫ్టీ కూడా అప్రమత్త ధోరణిలో సాగే వీలుంది. ప్రస్తుత గరిష్ఠ స్థాయిల వద్ద కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. ప్రధాన నిరోధ స్థాయిలైన 24,200 వద్ద నిలదొక్కుకుంటేనే అప్‌ట్రెండ్‌ను కనబరుస్తుందా లేదా అనేది తేలుతుంది. మరోవైపు వీక్లీ ప్రాతిపదికన మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1,750 పాయింట్ల బలమైన ర్యాలీతో 62,900 స్థాయిలకు చేరువలో ముగిసింది. ఈ ఇండెక్స్‌కు గతంలో ఏర్పడిన బలమైన కరెక్షన్‌ స్థాయి ఇది. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా 587 పాయింట్ల ర్యాలీతో ఇటీవలి గరిష్ఠ స్థాయి 18,800 వద్ద క్లోజైంది. కొద్ది వారాల క్రితం ఈ సూచీ ఈ స్థాయిల నుంచి కరెక్షన్‌లోకి జారుకుంది.

బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ సానుకూల ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధ స్థాయిలైన 24,200 వద్ద నిలదొక్కుకోవాలి. ఇది గత వారం ఏర్పడిన గరిష్ఠ స్థాయి. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 24,500. ఇది స్వల్పకాలిక నిరోధ స్థాయి.

బేరిష్‌ స్థాయిలు: నిఫ్టీ ఏదేనీ బలహీనతను సూచిస్తే 23,800 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. సానుకూలత కోసం ఇక్కడ కచ్చితంగా నిలదొక్కుకోవాలి. లేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. తదుపరి మద్దతు స్థాయి 23,500.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 870 పాయింట్ల లాభంతో 57,685 వద్ద క్లోజైంది. పాజిటివ్‌ ట్రెండ్‌ కోసం ప్రధాన నిరోధ స్థాయిలైన 58,000 ఎగువన నిలదొక్కుకోవాలి. ఇది గతవారం ఏర్పడిన గరిష్ఠ స్థాయి. తదుపరి దిశను తీసుకునే ముందు ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. ఒకవేళ కరెక్షన్‌కు గురయితే 57,000 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది.

పాటర్న్‌: నిఫ్టీ 24,200 వద్ద ట్రిపుల్‌ టాప్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచుకుంది. సానుకూలత కోసం ఈ వారం ఇక్కడ నిలదొక్కుకోవాలి. నిఫ్టీ ప్రస్తుతం 100 రోజుల చలన సగటు వద్ద పరీక్షను ఎదుర్కొంటోంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్‌ రివర్సల్స్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24,120, 24,200

మద్దతు : 23,860, 23,800

వి. సుందర్‌ రాజా

ఇవి కూడా చదవండి..

మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 22 , 2026 | 05:22 AM