నిఫ్టీ-500 కంపెనీలకు లాభాల పంట
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:36 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో నిఫ్టీ- 500 సూచీ నమోదిత కంపెనీల మొత్తం నికర లాభం వార్షిక ప్రాతిపదికన 32 శాతం వృద్ధితో...
క్యూ2లో 32 శాతం వృద్ధితో రూ.5.14 లక్షల కోట్లకు చేరిక
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడి
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో నిఫ్టీ- 500 సూచీ నమోదిత కంపెనీల మొత్తం నికర లాభం వార్షిక ప్రాతిపదికన 32 శాతం వృద్ధితో రూ.5.14 లక్షల కోట్లకు చేరుకుంది. గడిచిన 12 త్రైమాసికాల్లో ఇదే అత్యధిక లాభాల వృద్ధి అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆర్థిక సేవల రంగ కంపెనీలు బలమైన ఆర్థిక పనితీరును కనబరచడం దేశీయ కార్పొరేట్ రంగ లాభదాయకత పెరుగుదలకు ప్రధానంగా దోహదపడిందని రిపోర్టు పేర్కొంది. అన్ని రంగాలు, మార్కెట్ విలువ ఆధారిత విభాగ కంపెనీల ఆదాయ, లాభాలు మెరుగుపడినప్పటికీ ప్రధానంగా మూడు రంగాల వాటా మొత్తం ఆదాయంలో 68 శాతంగా నమోదెంది.
మరిన్ని విషయాలు..
సమీక్షా త్రైమాసికంలో నిఫ్టీ-500 కంపెనీల విక్రయాల్లో 25 శాతం, స్థూల లాభం (ఎబిటా)లో 24 శాతం, నికర లాభంలో 32 శాతం వృద్ధి నమోదైంది. ఇంధన విక్రయ కంపెనీల (ఓఎంసీ)ను మినహాయిస్తే, విక్రయాలు, ఎబిటా 23 శాతం చొప్పున వృద్ధి చెందగా.. నికర లాభం 30 శాతం పెరిగింది.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థానికి (ఏప్రిల్-సెప్టెంబరు) ఓఎంసీలు మినహా మిగతా కంపెనీల మొత్తం లాభం 27ు పెరిగింది.
నిఫ్టీ-100 లిస్టెడ్ కంపెనీల లాభాలు 34 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్-150 సంస్థల లాభాలు 24 శాతం పెరిగాయి.
నిఫ్టీ-500లోని సగానికి పైగా కంపెనీలు 15 శాతానికి పైగా లాభాల వృద్ధిని కనబరిచాయి. కేవలం 4 శాతం సంస్థలు మాత్రమే నష్టాలను ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి:
ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్ బర్త్‌డే విషెస్..
వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!