టెక్ వ్యూ 25,000 వద్ద పరీక్ష
ABN , Publish Date - Nov 16 , 2026 | 02:09 AM
నిఫ్టీ గత వారం ఆరంభంలో ర్యాలీని కనబరిచి 25,000 ఎగువకి చేరింది. ఆ తర్వాత రియాక్షన్‌కు గురై వెంటనే కోలుకుని 25,400 స్థాయిని తాకింది....
నిఫ్టీ గత వారం ఆరంభంలో ర్యాలీని కనబరిచి 25,000 ఎగువకి చేరింది. ఆ తర్వాత రియాక్షన్‌కు గురై వెంటనే కోలుకుని 25,400 స్థాయిని తాకింది. నిఫ్టీ గత వారం గరిష్ఠ-కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడుతూ మైనర్ శ్రేణిలో అనిశ్చితిగా సాగుతూ చివరికి 160 పాయింట్ల స్వల్ప లాభంతో 25,140 వద్ద క్లోజైంది. మొత్తం ట్రెండ్ సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఈ వారం బుల్లిష్ ట్రెండ్‌కు కొంత బ్రేక్ పడే అవకాశం ఉంది. గడచిన మూడు వారాల్లో నిఫ్టీ 22,400 స్థాయిల నుంచి 25,400 స్థాయిలకు చేరటమే ఇందుకు కారణం. ప్రస్తుతం నిఫ్టీ ప్రధాన మానసిక అవధి స్థాయిలైన 25,000 ఎగువన ఉంది. ఇక్కడ మరోసారి గట్టి పరీక్షను ఎదుర్కొనవచ్చు. కొద్ది రోజులు ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకుంటేనే సానుకూల సంకేతాలు వెలువరిస్తుందా లేదా అనేది తేలుతుంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా గత వారం మంచి ర్యాలీ కనబరిచి 2 శాతం లాభంతో 61,900 వద్ద క్లోజైంది. నిరోధ స్థాయిలైన 62,000 వద్ద నిలదొక్కుకుంటేనే తదుపరి ర్యాలీని కొనసాగిస్తుంది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ కూడా 2.5 శాతం లాభంతో 19,650 వద్ద ముగిసింది.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ గత వారం 25,000 వద్ద అప్‌సైడ్ బ్రేకౌట్‌ను సాధించింది. దీంతో పుల్‌బ్యాక్ కరెక్షన్కు అవకాశం ఏర్పడింది. గరిష్ఠ స్థాయిల వద్ద స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. సానుకూల ట్రెండ్‌ను కనబరిస్తే తదుపరి నిరోధం 25,400 ఎగువన ఉంటుంది. తదుపరి ప్రధాన నిరోధ స్థాయిలు 25,750, 26,000.
బేరిష్ స్థాయిలు: నిఫ్టీ మరింత బలహీనతను సూచిస్తే ప్రస్తుత మద్దతు స్థాయిలైన 25,000 వద్ద పరీక్షను ఎదుర్కొనవచ్చు. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే బలహీనతను సూచిస్తుంది. ట్రేడర్లు అప్రమత్తతతో వ్యవహరించటం మంచిది. తదుపరి మద్దతు స్థాయి 24,500.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ 2,200 పాయింట్లతో బలమైన ర్యాలీని కనబరిచి చివరకు 61,000 వద్ద క్లోజైంది. ప్రస్తుతం ఈ సూచీ ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరువలో ఉంది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏర్పడిన గరిష్ఠ స్థాయి. ఈ సూచీ సానుకూల ట్రెండ్‌ను కనబరచాలంటే నిరోధ స్థాయిలైన 61,600 ఎగువన నిలదొక్కుకోవాలి. ఇది స్వల్పకాలిక సానుకూల సంకేతం. ఒకవేళ 61,000 వద్ద నిలదొక్కుకోలేకపోతే బలహీతను సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మద్దతు స్థాయిలు 60,400, 60,000 దిగువన ఉంటాయి.
పాటర్న్: నిఫ్టీ ప్రస్తుతం స్వల్పకాలిక ఓవర్‌బాట్ పొజిషన్లోకి అడుగుపెట్టినట్లు ఆర్‌ఎ్‌సఐ సూచిస్తోంది. గరిష్ఠ స్థాయిల వద్ద అప్రమత్తతను కనబరుస్తోంది. నిఫ్టీ 25,000 వద్ద అడ్డంగా దిగువకు ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్ వద్ద ఉంది. సానుకూలత కోసం కొద్ది రోజులు ఇక్కడ నిలదొక్కుకోవాలి. ప్రస్తుతం గరిష్ఠ స్థాయిల వద్ద కన్సాలిడేషన్ ప్యాట్రన్‌ను సూచిస్తోంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 25,290, 25,400
మద్దతు : 25,080, 25,000
వి. సుందర్ రాజా
ఈ వార్తలు కూడా చదవండి:
ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం
వికారాబాద్‌లో మహిళా క్రికెటర్ మృతి!