అప్రమత్తత బెటర్..!
ABN , Publish Date - Apr 06 , 2026 | 02:40 AM
పశ్చిమాసియా యుద్ధం ముగియటంపై సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ఒకవైపు క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి...
పశ్చిమాసియా యుద్ధం ముగియటంపై సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ఒకవైపు క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారుకునే అవకాశం కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం పెరగనున్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటం మంచిది. ప్రస్తుతం ఐటీ, ఫార్మా రంగాలు మాత్రమే కొంత మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభంలో ఇవి మాత్రమే కాస్త తక్కువగా పతనమయ్యాయి.
స్టాక్ రికమండేషన్స్
కోఫోర్జ్: ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ షేరు 50 శాతం మేర పతనమైంది. తాజాగా రూ.980 స్థాయిలో మద్దతు లభించటంతో మూమెంటమ్ పెరిగింది. రిలేటివ్ స్ట్రెంత్ పుంజుకుంటోంది. గత గురువారం రూ.1,213 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.1,200 శ్రేణిలో ఎంటరై రూ.1,355 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,180 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
హెచ్‌సీఎల్ టెక్: గత ఏడాది జనవరి నుంచి డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరు ప్రస్తుతం పుంజుకుంటోంది. కీలకమైన రూ.1,300 స్థాయిలో బలమైన మద్దతు లభించింది. ఇదే స్థాయిలో కన్సాలిడేట్ అవుతున్నాయి. గత గురువారం రూ.1,402 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లోకి మదుపరులు రూ.1,380 శ్రేణిలో ప్రవేశించి రూ.1,450/1,500 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.1,355.
టెక్ మహీంద్రా: ఈ కౌంటర్‌కు రూ.1,830 వద్ద నిరోధం ఎదురయ్యాక 29 శాతం మేర పతనమైంది. అయితే రూ.1,300 స్థాయిలో మద్దతు లభించింది. ఇదే స్థాయిలో కొనుగోళ్లపై ఆసక్తి పెరిగింది. గత సెషన్లో రూ.1,441 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లోకి మదుపరులు రూ.1,420 స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.1,560 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.1,380.
అదానీ పవర్: కొన్ని రోజులుగా ఈ షేరు గరిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేట్ అవుతోంది. 200 డీఎంఏ వద్ద మద్దతు తీసుకున్న ఈ షేరు స్వల్పకాల నిరోధాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మూమెంటమ్, రిలేటివ్ స్ట్రెంత్ క్రమంగా పెరుగుతున్నాయి. చివరి 22 సెషన్లలో 22 శాతం రాబడిని ఇచ్చింది. గత గురువారం రూ.159 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లోకి మదుపరులు రూ.155 శ్రేణిలో ప్రవేశించి రూ.185 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.145 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
పర్సిస్టెంట్ సిస్టమ్స్: ఈ ఏడాది జనవరి గరిష్ఠం నుంచి 32 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు ప్రస్తుతం రూ.4,486 మద్దతు స్థాయి నుంచి పుంజుకుంది. చివరి పది సెషన్లలో 16 శాతం మేర రాణించింది. నిఫ్టీతో పోల్చితే మెరుగ్గా రాణిస్తోంది. గత గురువారం రూ.5,227 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.5,100/5,150 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.6,250 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.5,050.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు