ఈ వారం ఆటుపోట్లలోనే..!
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:31 AM
ఈ వారం భారత స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోను కావచ్చు. సైడ్‌వేస్‌లో చలించే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగటం, క్రూడాయుల్ ధరల పెరుగుదల, ఎఫ్‌ఐఐల...
ఈ వారం భారత స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోను కావచ్చు. సైడ్‌వేస్‌లో చలించే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగటం, క్రూడాయుల్ ధరల పెరుగుదల, ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ, వడ్డీ రేట్లపై ఫెడ్ రిజర్వ్ నిర్ణయం వంటి అంశాలు మార్కెట్ల గమనాన్ని ప్రభావితం చేయనున్నాయి. మరోవైపు కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపించే వీలుంది. ఈ నేపథ్యంలో మదుపరులు జాగ్రత్తగా ఉండటం మంచిది.
స్టాక్ రికమండేషన్స్
అదానీ గ్రీన్‌ఎనర్జీ: ఈ షేరు ప్రస్తుతం సెకండ్ స్టేజ్‌లో ఉంది. ధర అన్ని మూవింగ్ యావరేజె్‌సపైనే కదలాడుతోంది. చివరి మూడు నెలల్లో 92 శాతం మేర పెరిగింది. నిఫ్టీతో పోల్చితే జోరును ప్రదర్శిస్తోంది. అయితే ప్రస్తుతం కాస్త దిద్దుబాటుకు లోనైంది. గత శుక్రవారం రూ.1,395 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,370 శ్రేణిలో ఎంటరై రూ.1,640 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.1,340 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఆర్‌ఈసీ లిమిటెడ్: రెండేళ్లుగా ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. జీవితకాల గరిష్ఠ స్థాయి నుంచి 51 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. ప్రస్తుతం సెల్లింగ్ పూర్తయినట్టే కనిపిస్తోంది. రూ.300 స్థాయిలో కన్సాలిడేట్ అవుతోంది. 200 రోజుల మూవింగ్ యావరేజీని అధిగమించే అవకాశం కనిపిస్తోంది. రిలేటివ్ స్ట్రెంత్ క్రమంగా పెరుగుతోంది. గత శుక్రవారం రూ.361 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.355 ఎగువన ప్రవేశించి రూ.395/415 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.350 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఇండియన్ హోటల్స్: జీవితకాల గరిష్ఠం నుంచి 36 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు రూ.560 వద్ద టర్న్ అరౌండ్ అయ్యింది. చివరి రెండు నెలల్లోనే 27 శాతం మేర పెరిగింది. నిఫ్టీతో పోల్చితే రిలేటివ్ స్ట్రెంత్ మెరుగ్గా ఉంది. గత శుక్రవారం రూ.727 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.720 శ్రేణిలో ప్రవేశించి రూ.810 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.700 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
పీఎ్‌ఫసీ: ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ షేరు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. రూ.486 వద్ద తాజా గరిష్ఠాన్ని నమోదు చేసిన తర్వాత 17 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. ఇప్పుడు 200 రోజుల మూవింగ్ యావరేజీ వద్ద మద్దతు తీసుకుని పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.411 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.400 ఎగువ శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.480 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.385 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
యాక్సిస్ బ్యాంక్: ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ షేరు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ దశ నడుస్తోంది. అయితే రూ.1,230 స్థాయిలో మద్దతు లభించే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.1,227 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,200 పై స్థాయిలో ఎంటరై రూ.1,440 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.1,180 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం
అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు