Share News

ఈ వారం మెరుగ్గానే..!

ABN , Publish Date - Feb 09 , 2026 | 05:16 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మెరుగ్గా కదలాడే అవకాశం కనిపిస్తోంది. అమెరికాతో ట్రేడ్‌ డీల్‌ ఖరారవ్వటం, ఏయే రంగాల వస్తువులపై ఎలాంటి పన్ను ఉంటుందో తెలియటంతో ఆయా రంగాల...

ఈ వారం మెరుగ్గానే..!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మెరుగ్గా కదలాడే అవకాశం కనిపిస్తోంది. అమెరికాతో ట్రేడ్‌ డీల్‌ ఖరారవ్వటం, ఏయే రంగాల వస్తువులపై ఎలాంటి పన్ను ఉంటుందో తెలియటంతో ఆయా రంగాల షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ పరిణామాలు, ఇరాన్‌-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ఓ కన్నేసి ఉంచటం మంచిది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలు, ఎనర్జీ, కమోడిటీస్‌, చమురు, ఇన్‌ఫ్రా రంగ షేర్లు పటిష్ఠతను సూచిస్తున్నాయి. మెటల్‌, పీఎ్‌సయూ బ్యాంక్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లపై కూడా దృష్టి సారించవచ్చు.

స్టాక్‌ రికమండేషన్స్‌

బీపీసీఎల్‌ : గత ఏడాది మార్చి నుంచి ఈ షేరు అప్‌ట్రెండ్‌లోనే కొనసాగుతోంది. ఇన్వెస్టర్లకు 70 శాతం మేర రాబడిని అందించింది. జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేట్‌ అవుతోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగ్గా ఉంది. గత శుక్రవారం రూ.386 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.380 ఎగువన పొజిషన్‌ తీసుకుని రూ.425 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.365 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

భారతి ఎయిర్‌టెల్‌: జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ కౌంటర్‌లో 12 శాతం మేర హెల్తీ కరెక్షన్‌ జరిగింది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ పర్వాలేదు. మూమెంటమ్‌ కనిపిస్తే మళ్లీ జోరందుకునే సూచనలు ఉన్నాయి. గత శుక్రవారం రూ.2,038 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.2,020 స్థాయిలో ప్రవేశించి రూ.2,200 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,990 స్థాయిని స్టాప్‌లా్‌సగా ఉంచుకోవాలి.

బజాజ్‌ ఫైనాన్స్‌: ఈ షేరు జీవితకాల గరిష్ఠాన్ని చేరిన తర్వాత 20 శాతం మేర దిద్దుబాటు జరిగింది. కీలకమైన రూ.932 వద్ద మద్దతు తీసుకుని మళ్లీ అప్‌ట్రెండ్‌ బాట పట్టాయి. గత శుక్రవారం రూ.981 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.970 పై స్థాయిలో ప్రవేశించి రూ.1,080 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.950 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


గోద్రెజ్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌: జీవితకాల గరిష్ఠం నుంచి 36 శాతం మేర పతనమైన ఈ షేరు కొన్ని నెలలుగా సైడ్‌వే్‌సలో చలిస్తోంది. మరోసారి రూ.1,100 స్థాయి వద్ద మద్దతు తీసుకుంది. డివిడెండ్‌ ప్రకటన నేపథ్యంలో మళ్లీ కొంతమేరకు రాణించే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.1,181 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,170 ఎగువన ఎంటరై రూ.1,300 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,130 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

సీజీ పవర్‌: ఆర్థిక ఫలితాల విడుదల, ఆదాయం పెరగటంతో ఈ కౌంటర్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. రిలేటివ్‌ స్ట్రెంత్‌, వాల్యూమ్‌ భారీగా పెరుగుతోంది. గత శుక్రవారం రూ.674 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.660 ఎగువన ప్రవేశించి రూ.755 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.645 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

షేర్వానీ వేసుకో.. రూబీ టోపీ పెట్టుకో

బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నేత రమేశ్‌ చంద్ర పోలీసు కస్టడీలో మృతి

Updated Date - Feb 09 , 2026 | 05:16 AM