అప్రమత్తత బెటర్..!
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:25 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మరింత ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం కావటం, మిత్ర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, రిఫైనరీల మీద దాడులు చేయటం ద్వారా...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మరింత ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం కావటం, మిత్ర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, రిఫైనరీల మీద దాడులు చేయటం ద్వారా ఇరాన్ ఈ యుద్ధాన్ని మరింతగా విస్తరిస్తోంది. చాలా చోట్ల చమురు సరఫరా నిలిచిపోవటంతో ఇప్పటికే క్రూడాయిల్ ధరలు 90 డాలర్ల ఎగువకు చేరాయి. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మదుపరులు ఎంపిక చేసుకున్న షేర్లలోనే పెట్టుబడులు పెట్టడం మంచిది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.
స్టాక్ రికమండేషన్స్
యూబీఎల్: జీవితకాల గరిష్ఠ స్థాయి నుంచి 38 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు ప్రస్తుతం దూకుడును ప్రదర్శిస్తోంది. నిఫ్టీతో పోల్చితే మెరుగ్గా రాణిస్తోంది. రిలేటివ్ స్ట్రెంత్, వాల్యూమ్ అనూహ్యంగా పుంజుకున్నాయి. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 26 శాతం మేర రాబడి అందించాయి. గత శుక్రవారం రూ.1,758 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,730 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.1,940 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,700 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
బీడీఎల్: గత ఏడాది జూన్ నుంచి పతనమవుతూ వస్తున్న ఈ షేరు రూ.1,280 స్థాయిలో మద్దతు లభించింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. రిలేటివ్ స్ట్రెంత్ క్రమంగా పుంజుకుంటోంది. గత శుక్రవారం రూ.1,356 దగ్గర క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,300 ఎగువన ప్రవేశించి రూ.1,440 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,260 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
జేఎ్‌సడబ్ల్యూ ఇన్‌ఫ్రా: కొన్ని నెలలుగా ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఈ షేరుపై మళ్లీ ఫోకస్ పెరిగింది. వాల్యూమ్, రిలేటివ్ స్ట్రెంత్ క్రమంగా పెరుగుతోంది. చివరి మూడు సెషన్లలోనే 13 శాతం పెరిగింది. గత శుక్రవారం రూ.268 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.260 ఎగువన ఎంటరై రూ.310 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.250 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఆస్ట్రాల్: జీవితకాల గరిష్ఠం నుంచి 50 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు ప్రస్తుతం పుంజుకుంటోంది. చక్కని బేస్ ఏర్పడిన తర్వాత స్వల్పకాలిక బ్రేకౌట్‌తో దూకుడు ప్రదర్శిస్తోంది. రిలేటివ్ స్ట్రెంత్ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.1,689 వద్ద ముగిసిన కౌంటర్‌లో మదుపరులు రూ.1,650 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.1,800 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,620 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
సీజీ పవర్: రెవెన్యూ పెరగటం, డివిడెండ్ ఇవ్వటం, డిసెంబరు త్రైమాసిక ఫలితాల తర్వాత ఈ షేరుపై ఆసక్తి పెరిగింది. రిలేటివ్ స్ట్రెంత్, వాల్యూమ్ బాగా పెరుగుతోంది. పైగా డబుల్ బాటమ్ ఫార్మేషన్ కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.715 దగ్గర ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.700 ఎగువన ప్రవేశించి రూ.880 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.680 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఈ వార్తలూ చదవండి:
బొగ్గులా నల్లగా దోశ.. రెస్టారెంట్ ప్రయోగం వైరల్
కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఇంటి ముందు వ్యక్తి డ్యాన్స్! ఎందుకో తెలిస్తే..