ఆరంభ నష్టాల నుంచి రికవరీ
ABN , Publish Date - May 19 , 2026 | 02:10 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం స్వల్ప లాభాలతో ముగిసింది. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి 77.05 పాయింట్ల స్వల్ప లాభంతో 75,315.04 వద్ద ముగిసింది....
సెన్సెక్స్ 77 పాయింట్లు అప్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం స్వల్ప లాభాలతో ముగిసింది. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి 77.05 పాయింట్ల స్వల్ప లాభంతో 75,315.04 వద్ద ముగిసింది. ఒక దశలో 1,134.78 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్ 74,180.26 పాయింట్ల ఇంట్రాడే కనిష్ఠ స్థాయిని తాకింది. ట్రేడింగ్ చివర్లో ఎంపిక చేసిన ఐటీ, ఫార్మా, కొన్ని బ్లూచిప్ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కింది. నిఫ్టీ 50 సూచీ కూడా సోమవారం 6.45 పాయింట్ల స్వల్ప లాభంతో 23,649.95 వద్ద ముగిసింది. కొనసాగుతున్న చమురు మంట, రూపాయి పతనం, కొనసాగిన ఎఫ్‌పీఐల అమ్మకాలు మార్కెట్లను భయపెట్టాయి.
నిఫ్టీలోకి బీఎ్‌సఈ: సెప్టెంబరు 30న జరిగే నిఫ్టీ 50 సూచీ పునర్ వ్యవస్థీకరణలో, ఆ సూచీ నుంచి విప్రో కంపెనీ షేర్లను తొలగించే అవకాశం కనిపిస్తోంది. ఆ స్థానంలో బీఎ్‌సఈ షేర్లకు స్థానం లభించే అవకాశం ఉందని దేశీయ బ్రోకరేజీ సంస్థ యాక్సిస్ క్యాపిటల్ తెలిపింది. ఈ మార్పులతో 22.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు బయటికి వెళ్లినా, 65.7 కోట్ల డాలర్ల పెట్టుబడులు కొత్తగా నిఫ్టీ 50 షేర్లలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.
సరికొత్త కనిష్ఠానికి రూపాయి
డాలర్‌తో రూపాయి మారకం రేటు సోమవారం మరో ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఉదయం ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌తో రూ.96.19 వద్ద ప్రారంభమైన రూపాయి మారకం రేటు.. ఒక దశలో 58 పైసల నష్టంతో రూ.96.39 ఇంట్రాడే ఆల్‌టైం కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 39 పైసల నష్టంతో రూ.96.20 వద్ద ముగిసింది.
ఇవి కూడా చదవండి..
సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..
ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..