ఈ వారం మిశ్రమ ధోరణే..!
ABN , Publish Date - May 11 , 2026 | 02:01 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమ ధోరణిలో సాగే అవకాశం ఉంది. ఇరాన్, అమెరికా యుద్ధంపై వస్తున్న వార్తలు గందరగోళం సృష్టిస్తుండటం, ఇన్వెస్టర్లలో విశ్వాసం లేకపోవటంతో...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమ ధోరణిలో సాగే అవకాశం ఉంది. ఇరాన్, అమెరికా యుద్ధంపై వస్తున్న వార్తలు గందరగోళం సృష్టిస్తుండటం, ఇన్వెస్టర్లలో విశ్వాసం లేకపోవటంతో పాటు రూపాయి బలహీనత ఇందుకు కారణాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఎనర్జీ, రియల్టీ, మీడియా, కమోడిటీస్, ఎఫ్‌ఎంసీజీ, చమురు రంగాల షేర్లు మూమెంటమ్ ప్రదర్శిస్తున్నాయి.
స్టాక్ రికమండేషన్స్
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్: ఈ ఏడాది ఆరంభంలో చక్కని బేస్ బ్రేకౌట్‌తో జీవితకాల గరిష్ఠాన్ని చేరిన ఈ షేరు ఆ తర్వాత దిద్దుబాటుకు లోనైంది. దాదాపుగా 33 శాతం పతనమైన ఈ షేరు మళ్లీ పుంజుకుని 25 శాతం రాబడిని అందించింది. ప్రస్తుతం కీలక జోన్‌లో ఉంది. గత శుక్రవారం రూ.339 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.330 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.385 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.310 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకోవాలి.
ఐడీఎ్‌ఫసీ బ్యాంక్: గత ఏడాది 62 శాతం ర్యాలీ కొనసాగించిన ఈ కౌంటర్ ఈ ఏడాది జనవరి నుంచి 32 శాతం మేర పతనమైంది. అయితే ఈ ఏప్రిల్‌లో రూ.57 వద్ద మద్దతు తీసుకుని 23 శాతం వరకు పుంజుకుంది. రిలేటివ్ స్ట్రెంత్ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.71 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపులు రూ.70 శ్రేణిలో ప్రవేశించి రూ.82 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.68 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
సీపీ ప్లస్ (ఆదిత్య ఇన్ఫోటెక్): గత ఏడాది ఆగస్టులో లిస్టయిన ఈ షేరు ఇప్పటి వరకు 150 శాతం మేర రాబడి అందించింది. డిసెంబరులో కరెక్షన్‌కు లోనైనా చక్కని బ్రేకౌట్‌తో జోరు ప్రదర్శించింది. గత శుక్రవారం రూ.2,508 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.2,450 ఎగువన ప్రవేశించి రూ.2,600 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.2,420 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
ఫోర్టిస్: కొన్నేళ్లుగా ఈ షేరు మంచి బుల్ రన్ కొనసాగిస్తోంది. జీవితకాల గరిష్ఠం తర్వాత 30 శాతం మేర కరెక్షన్‌కు లోనైంది. చివరి 21 సెషన్లలో 26 శాతం పెరగటం, బ్రేకౌట్‌కు సిద్ధమవటం, ఫలితాలు విడుదల చేయనుండటంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది. గత శుక్రవారం రూ.952 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో రూ.950 శ్రేణిలో ప్రవేశించి రూ.1,080 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.930 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
టాటా టెక్నాలజీస్: ఐపీఓకి వచ్చినప్పటి నుంచి ఈ షేరు పతనం దిశగానే సాగుతోంది. అయితే ఈ ఏప్రిల్ నుంచి 30 శాతం రాబడిని ఇవ్వటం, ఆర్థిక ఫలితాలు విడుదలయ్యాక భారీ వాల్యూమ్‌తో 200 రోజుల మూవింగ్ యావరేజ్ బ్రేక్ కావటం సానుకూల అంశాలు. గత శుక్రవారం రూ.630 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.600 శ్రేణిలో ప్రవేశించి రూ.720 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.585 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
ఈ వార్తలనూ చదవండి:
'స్మార్ట్' గా ఆలోచిస్తే గృహ రుణాల్లో బోలెడు ఆదా