పతన బాటలోనే మార్కెట్లు
ABN , Publish Date - May 09 , 2026 | 04:56 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిసాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత సంక్లిష్టం కావటంతో ఇంధన సరఫరాల్లో మళ్లీ...
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిసాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత సంక్లిష్టం కావటంతో ఇంధన సరఫరాల్లో మళ్లీ అవాంతరాలు ఏర్పడవచ్చనే భయాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. దీంతో శుక్రవారం దేశీయ ఈక్విటీ సూచీలు బేరిష్ ట్రెండ్‌లో సాగాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్ 516.33 పాయింట్ల నష్టంతో 77,368.19 వద్ద క్లోజైంది. ఇంట్రాడేలో ఒక దశలో సూచీ 698 పాయింట్లకు పైగా పతనమై 77,146.43 పాయింట్ల స్థాయిని తాకింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ కూడా 150.50 పాయింట్లు నష్టపోయి 24,176.15 పాయింట్ల వద్ద క్లోజైంది. అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి యుద్ధానికి దిగొచ్చనే వార్తలతో బ్యారల్ క్రూడాయిల్ ధర 100 డాలర్ల ఎగువకు చేరుకోవటం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో సాగటానికి ప్రధాన కారణంగా ఉందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
దేశంలో తొలి స్పేస్ టెక్ యూనికార్న్‌గా స్కైరూట్