Share News

రూ.5 లక్షల కోట్లు ఆవిరి

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:54 AM

స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. గురువారం ట్రేడింగ్‌ లో సెన్సెక్స్‌ ఒక దశలో 1,187.41 పాయింట్లు పతనమై 71,292.88 వద్ద సరికొత్త ఏడాది కనిష్ఠాన్ని నమోదు చేసింది. మళ్లీ కాస్త తేరుకుని...

రూ.5 లక్షల కోట్లు ఆవిరి

  • నాలుగో రోజూ నష్టాల్లోనే మార్కెట్‌

  • 570 పాయింట్లు క్షీణించి 72,000 దిగువకు జారిన సెన్సెక్స్‌

  • ఇంట్రాడేలో ఏడాది కనిష్ఠానికి పతనం

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. గురువారం ట్రేడింగ్‌ లో సెన్సెక్స్‌ ఒక దశలో 1,187.41 పాయింట్లు పతనమై 71,292.88 వద్ద సరికొత్త ఏడాది కనిష్ఠాన్ని నమోదు చేసింది. మళ్లీ కాస్త తేరుకుని 570.59 పాయింట్ల నష్టంతో 71,909.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 198.50 పాయింట్లు క్షీణించి 22,421.95 వద్ద ముగిసింది. బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌, మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీలు 0.96 శాతం వరకు నష్టపోయాయి. ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.4.9 లక్షల కోట్లు తగ్గి రూ.466.96 లక్షల కోట్లకు (4.86 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు, యూఎస్‌ బాండ్ల వడ్డీ రేట్ల పెరుగుదలతో పాటు ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం ఇందుకు కారణమయ్యాయి. క్రితం సెషన్‌లో 100 డాలర్ల దిగువకు జారిన బ్రెంట్‌ ముడిచమురు పీపా ధర.. మళ్లీ 2.7 శాతం మేర పెరిగి 100.8 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

ఈ వార్తలు కూడా చదవండి

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు.. సెప్టెంబర్‌లో రూ.5,327 కోట్లు

Updated Date - Oct 02 , 2026 | 05:54 AM