Share News

వారాంతంలో భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:56 PM

ఈ వారం ప్రారంభంలో వరుస లాభాలు చవిచూసిన భారత స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలు చవిచూశాయి. నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు భారీగా నష్టపోయాయి.

వారాంతంలో భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు
Sensex Nifty Big Losses

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 13: భారత స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలకు గురయ్యాయి. ఇవాళ(శుక్రవారం) నిఫ్టీ 336.10(1.30 శాతం) పాయింట్లు పతనమై, 25,471.10 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1,048.16(1.25 శాతం) పతనమై, 82, 626.76 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.


AI ఆందోళనల కారణంగా ఐటీ అమ్మకాలు తీవ్రమవడంతో సూచీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఐటీ రంగ స్టాక్స్ అమ్మకాల మధ్య సెన్సెక్స్, నిఫ్టీ 1శాతం పైగా పడిపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈ వారం ఏకంగా 9 శాతం పడిపోయింది. ఏప్రిల్ 2025 తర్వాత ఇది అతిపెద్ద తగ్గుదల కావడం విశేషం. ఇవాళ అన్ని ప్రధాన రంగ సూచీలు నష్టాల్లో ముగిశాయి.


ఏఐ (కృత్రిమ మేధస్సు) ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య వరుసగా మూడవ సెషన్‌లో ఐటీ స్టాక్‌లలో భారీ అమ్మకాలు జరిగాయి. అటు, బ్రాడ్ మార్కెట్స్ కూడా భారీ అమ్మకాలను చూశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు 2 శాతం తగ్గాయి.

Updated Date - Feb 13 , 2026 | 04:43 PM