Share News

టెక్‌ వ్యూ 25,000 వద్ద నిలదొక్కుకుంటేనే..

ABN , Publish Date - Mar 02 , 2026 | 02:07 AM

గత వారం నిఫ్టీ తొలుత రికవరీ కనబరిచి 25,770 స్థాయిలకు చేరుకుంది. ఆ తర్వాత గరిష్ఠ స్థాయిలైన 26,000 వద్ద బలహీనతను సూచించింది. చివరకు వారాంతంలో 300 పాయింట్ల నష్టంతో 25,178 స్థాయిల వద్ద...

టెక్‌ వ్యూ 25,000 వద్ద నిలదొక్కుకుంటేనే..

టెక్‌ వ్యూ 25,000 వద్ద నిలదొక్కుకుంటేనే..

గత వారం నిఫ్టీ తొలుత రికవరీ కనబరిచి 25,770 స్థాయిలకు చేరుకుంది. ఆ తర్వాత గరిష్ఠ స్థాయిలైన 26,000 వద్ద బలహీనతను సూచించింది. చివరకు వారాంతంలో 300 పాయింట్ల నష్టంతో 25,178 స్థాయిల వద్ద క్లోజైంది. వారం మొత్తం మీద నిఫ్టీ 400 పాయింట్లు (1.5 శాతం) నష్టపోయింది. ఫిబ్రవరి నెలలో నిఫ్టీ 26,340 గరిష్ఠ స్థాయిల నుంచి 1,200 పాయింట్ల మేర పతనమైంది. గడచిన మూడు నెలలుగా మార్కెట్‌ కరెక్షన్‌ ట్రెండ్‌లోనే సాగుతోంది. నిఫ్టీ ఇటీవలి మద్దతు స్థాయిలైన 25,500 వద్ద నిలదొక్కుకోలేక పోవటంతో మరింత బలహీనతను సూచిస్తోంది. అమెరికా-ఇరాన్‌ యుద్ధంతో మార్కెట్లు మరింత పతనమయ్యే అవకాశం ఉంది.

బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ ఆటుపోట్ల ట్రెండ్‌లో సాగే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌ నుంచి కోలుకుని రికవరీ కనబరిస్తే తదుపరి ప్రధాన నిరోధ స్థాయి లు 25,300, 25,500 ఎగువన ఉంటాయి.

బేరిష్‌ స్థాయిలు: సానుకూలత కోసం మద్దతు స్థాయిలైన 25,000 ఎగువన కచ్చితంగా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.మద్దతు స్థాయిలు 24,750, 24,500.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 640 పాయిం ట్లు నష్టపోయి 60,530 వద్ద క్లోజైంది. మూడు వారాల పాటు నిరోధ స్థాయిలైన 61,000 పాయింట్ల వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొని నిలదొక్కుకోలేక మరింత బలహీనతను సూచించింది. మరింత బలహీనతను సూచిస్తే 59,900 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ కూడా నిలదొక్కుకోలేకపోతే అప్రమత్తతను సూచిస్తుంది. సానుకూల ట్రెండ్‌ కోసం 60,600 ఎగువన నిలదొక్కు కోవాల్సి ఉంటుంది.

పాటర్న్‌: మార్కెట్‌ గతవారం 200 డిఎంఏ దిగువకు చేరింది. సానుకూలత కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి.అలాగే సానుకూలత కోసం 25,500 స్థాయి లో ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం శుక్రవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 25,210, 25,300

మద్దతు : 25,000, 24,910

వి. సుందర్‌ రాజా

ఇవి కూడా చదవండి

చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు

ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం

Updated Date - Mar 02 , 2026 | 02:07 AM