Share News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు పడేశాయ్‌..

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:41 AM

స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు సోమవారం నష్టాల్లో పయనించాయి. ఒక దశలో 783 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్‌.. చివరికి 442.93 పాయింట్ల నష్టంతో 77,708.52 వద్ద స్థిరపడింది...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు పడేశాయ్‌..

  • సెన్సెక్స్‌ 443 పాయింట్లు పతనం

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు సోమవారం నష్టాల్లో పయనించాయి. ఒక దశలో 783 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్‌.. చివరికి 442.93 పాయింట్ల నష్టంతో 77,708.52 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95.80 పాయింట్లు కోల్పోయి 24,238.50 వద్దకు జారుకుంది. నిరాశాజనక త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడటం ఇందుకు ప్రధాన కారణం. అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న దాడులు కూడా ట్రేడింగ్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి.

23 నుంచి ఇండో ఎంఐఎం ఐపీఓ: ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ విడిభాగాల తయారీ సంస్థ ఇండో ఎంఐఎం లిమిటెడ్‌ రూ.3,812 కోట్ల ఐపీఓతోపాటు ఇండస్ట్రియల్‌ మెషినరీ తయారీదారు లోహియా కార్ప్‌ లిమిటెడ్‌ రూ.1,102 కోట్ల పబ్లిక్‌ ఇష్యూ కూడా 23న ప్రారంభమై 27న ముగియనున్నాయి. ఇండో ఎంఐఎం ఐపీఓ ధరల శ్రేణిని రూ. 461-485గా నిర్ణయించింది. లోహియా కార్ప్‌ ఇష్యూ ధరల శ్రేణి రూ.404-425గా ఉంది.

ఇవి కూడా చదవండి...

విక్రమ్‌-1 విజయంలో తెలుగు తేజాల కృషి

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ.

Updated Date - Jul 21 , 2026 | 05:41 AM