Share News

14 ఏళ్ల కనిష్ఠానికి ఎఫ్‌పీఐల వాటా

ABN , Publish Date - May 11 , 2026 | 01:53 AM

భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) వాటా 14 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఎఫ్‌పీఐలు.. దేశీయ ఈక్విటీల...

14 ఏళ్ల కనిష్ఠానికి ఎఫ్‌పీఐల వాటా

న్యూఢిల్లీ: భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) వాటా 14 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఎఫ్‌పీఐలు.. దేశీయ ఈక్విటీల నుంచి నిరవధికంగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ వస్తుండటమే ఇందుకు కారణం. 2012లో భారత ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌ఫీఐల పెట్టుబడుల వాటా 19.9 శాతంగా ఉండగా.. ప్రస్తుతం ఇది 14.7 శాతానికి పడిపోయింది. 2012 జూన్‌ తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి ఇదే. మే 8తో ముగిసిన వారంలో ఎఫ్‌పీఐలు రూ.14,207.20 కోట్లను వెనక్కు తీసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు రూ.2,18,540 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

డీఐఐల వాటా అప్‌: దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐ).. ప్రస్తుతం 18.9 శాతం వాటాతో మార్కెట్లో అతిపెద్ద పెట్టుబడిదారులుగా అవతరించారు. దేశీయ మ్యూచువల్‌ ఫండ్లు, బీమా సంస్థలు, ఇతర సంస్థాగత పెట్టుబడిదారుల మద్దతుతో 2024 డిసెంబరు తర్వాత తొలిసారిగా డీఐఐల వాటా.. విదేశీ పెట్టుబడుల వాటాను అధిగమించింది.

ఈ వార్తలనూ చదవండి:

'స్మార్ట్' గా ఆలోచిస్తే గృహ రుణాల్లో బోలెడు ఆదా

ఎస్‌బీఐ లాభం రూ.19,684 కోట్లు

Updated Date - May 11 , 2026 | 02:04 AM