4 రోజుల్లో రూ.21,000 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు వెనక్కి
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:20 AM
పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ మార్కెట్లో నెలకొన్న...
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా భారత ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారీగా నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనే (2-6 తేదీల మధ్య) రూ.21,000 కోట్ల పెట్టుబడులను వీరు ఉపసంహరించు కున్నారు. ఫిబ్రవరి నెలలో రూ.22,615 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు.. పశ్చిమాసియా యుద్ధంతో ఒక్కసారిగా అమ్మకాలకు దిగారు. బ్యారల్ ముడి చమురు ధర 90 డాలర్లు దాటడం, ఐటీ, కన్స్యూమర్ రంగాలకు సంబంధించి మార్చి త్రైమాసిక లాభాలపై ప్రభావం పడవచ్చనే అంశాలు కూడా ఎఫ్‌పీఐల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
ఈ వార్తలూ చదవండి:
బొగ్గులా నల్లగా దోశ.. రెస్టారెంట్ ప్రయోగం వైరల్
కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఇంటి ముందు వ్యక్తి డ్యాన్స్! ఎందుకో తెలిస్తే..